పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచించడమే కాకుండా, వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా వారిని నిట్టనిలువునా ముంచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పై మండిపడ్డారు.
అధికారం పొయిన తరువాత బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకొచ్చారు
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచించడమే కాకుండా, వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా వారిని నిట్టనిలువునా ముంచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పై మండిపడ్డారు.
మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోంది. బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం. విజ్ఞులైన బీసీలు ఈ కుట్రలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామని అన్నారుద.
కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే.
అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యతిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే.. మీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందా..? గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, వారికి మరింత ప్రయోజనకరంగా ఉండేలా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ధర్నా చేపట్టడం దురదృష్టకరం. బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలు, ప్రస్తుతం ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనలో చేపట్టిన చర్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను కవితను బీఆర్ ఎస్ నేతలను సవాలు చేస్తున్నానని అన్నారు.
Read:Kautalam:గ్రామ సభలు గ్రామ అభివృద్ధి కి కృషి