Hyderabad:రైతుల వెన్నంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

government is behind the farmers, says Governor Jishnu Dev Verma

Hyderabad:రైతుల వెన్నంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ:రైతు,యువత,మహిళ సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల కు సరైన ప్రాతినిధ్యం కల్పన కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

రైతుల వెన్నంటే రాష్ట్ర ప్రభుత్వం
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్
రైతు,యువత,మహిళ సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల కు సరైన ప్రాతినిధ్యం కల్పన కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు.రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం గవర్నర్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు గవర్నర్ ని స్పీకర్ మండలి చైర్మన్ సీఎం సహా పలువురు మంత్రులు స్వాగతం పలికారు. సభ లో ప్రసంగించిన గవర్నర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు.రైతులకు తమ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని అన్నారు.దీంతో పాటు రైతు కూలీలకు సైతం దన్నుగా నిలుస్తుందని చెప్పారు.తెలంగాణ ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపాంతరం చెందుతుందని అన్నారు.మహిళ శక్తి ని గుర్తించిన ప్రభుత్వం వారికి చేయూత ను అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. కాగా యువత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గవర్నర్ తెలిపారు.నైపుణ్యత పెంపొందించేందుకు స్కిల్ వర్సిటీ సహా పలు సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు.వైద్య,విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.హైదరాబాద్ ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దామని అన్నారు . కాగా శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. సమావేశాల ప్రారంభానికి ముందు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.

Read more:Hyderabad:రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్దఎత్తున పోటీ

 

Related posts

Leave a Comment