సిద్దేశ్వరస్వామికి రుద్ర కవచం సమర్పించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్
హుస్నాబాద్ అన్నపూర్ణ సమేత సిద్దేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ రుద్ర కవచం సమర్పించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి సిద్దేశ్వర స్వామి ఆలయం వద్దకు పాదయాత్ర గా రుద్రకవచాన్ని తీసుకుపోయారు. తరువాత సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రుద్రకవచాన్ని స్వామి వారికి సమర్పించారు. పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు..