సావిత్రి భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే కి ఘన నివాళులు అర్పిస్తూన్నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అక్కన్న పేటలో మంత్రి పొన్నం పర్యటన
సావిత్రి భాయ్ పులే కు నివాళులు
హుస్నాబాద్
సావిత్రి భాయ్ పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రి భాయ్ పులే కి ఘన నివాళులు అర్పిస్తూన్నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఆమెను తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం తో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించు కొని అమె జయంతిని రాష్ట్రాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రి భాయ్ పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్ లో అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ,ఇందిరమ్మ ఇళ్లు మహిళా సంఘాల పటిష్ఠం కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వం లక్ష్యం విద్య వ్యవస్థలో అనేక రకాల వసతులు కల్పిస్తుందని అన్నారు.