HMDA Revanth reddy with temporary employees | తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ | Eeroju news

HMDA Revanth reddy with temporary employees

 తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ

హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్)

HMDA Revanth reddy with temporary employees

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో హెచ్‌ఎండీఏది కీలక పాత్ర. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి, మౌలిక వసతులు, భవన నిర్మాణ అనుమతులలో అత్యంత ప్రముఖ పాత్రను పోషిస్తుంది. హైదరాబాద్‌ పరిధిని విస్తరించేలా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. అదే సమయంలో హెచ్‌ఎండీఏను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, సంస్థ బలోపేతానికి అవసరమైన మానవ వనరుల కొరత ఇప్పుడూ ఆ సంస్థను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో, డిప్యూటేషన్‌ ఉద్యోగులతో నెట్టుకొస్తుంది. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులను పూర్తి స్థాయిలో అమలులోకి రావడంలో జాప్యం జరుగుతుంది.

గడిచిన కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను ఇకనైనా భర్తీ చేస్తే గానీ హెచ్‌ఎండీఏ బలోపేతం సాధ్యం కాదనీ పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.భారీ లే అవుట్లు, ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు, సిటీ నలువైపులా కొత్త కొత్త టౌన్‌షిప్‌లకు అనుమతులు ఇవ్వడంలో హెచ్‌ఎండీఏదీ ప్రధాన పాత్ర. అంతే కాకుండా నగరానికి మణిహారంగా ఉన్న ఓఆర్‌ఆర్‌ నిర్వహణ, అవుటర్‌కు సమీపంలో లంగ్‌ స్పేస్‌ను పెంచడంలో కీలకమైన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నిర్మాణంతో పాటుగా మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వంటి వ్యవహారాలన్నీ హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోంది. ఇందులో ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌తో పాటు అర్బన్‌ ఫారెస్ట్రీ వంటి ప్రధాన విభాగాలు ఉండగా, హెచ్‌ఎండీఏ ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతులను జారీ చేసింది.

ఓ వైపు నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినా, నిర్మాణ అనుమతులను పర్యవేక్షించడానికి ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. అదే విధంగా కీలకమైన ప్రాజెక్టులను చేపట్టే ఇంజనీరింగ్‌ విభాగం కూడా చాలీచాలనీ సిబ్బందితో నెట్టుకొస్తుంది. ఎక్కడా ఏ ప్రాజెక్టును చేపట్టాలి. ఎప్పుడూ వాటిని పూర్తి చేయాలనే విషయాలను పర్యవేక్షించేందుకు సిబ్బంది కరువైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హెచ్‌ఎండీఏ పరిధిని ట్రిపుల్‌ ఆర్‌ వరకు విస్తరించాలనే ప్రతిపాదనలను తెర మీదకు తీసుకువస్తున్న తరుణంలో, సిబ్బంది కొరత ఇప్పుడు ఆ విభాగంలో చర్చనీయాంశంగా మారింది.

18 ఏండ్ల కిందట హెచ్‌ఎండీఏకు 600 పోస్టులు మంజూరైతే, ఇప్పటివరకు ఉద్యోగుల సంఖ్య 15శాతం లోపే ఉంటుంది. ఇక ఉద్యోగులందరినీ డిప్యూటేషన్‌, అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఎప్పుడో భర్తీ చేసిన సిబ్బందితోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. ఇన్నాళ్లుగా డిప్యూటేషన్‌ విధానంలో నెట్టుకొచ్చినా, పరిధిని పెంచే యోచనలో ఉన్న ప్రభుత్వానికి భర్తీ విషయంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలకమైన ప్లానింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మాతృ సంస్థ ఉద్యోగులను కాదనీ, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే వ్యవహారాలు చక్కబెట్టుస్తున్నారు.

ఈ క్రమంలో బిల్డింగ్‌, లే అవుట్‌ అనుమతుల విషయంలో కీలకమైన ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో మాతృ సంస్థ ఉద్యోగులను తీసుకు రావడం వలన, పాలన వ్యవహారాల్లోనూ పారదర్శకత పెరుగుతుంది. కానీ, ప్రభుత్వం అవేవీ పట్టనట్లుగా కేవలం పరిధి పెంచి ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తూ రెవెన్యూ పెంచుకునేందుకు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సిబ్బంది కొరత కారణంగా పని ఒత్తిడి పెరుగుతుందే తప్పా… సమర్థవంతంగా పనిచేసే సిబ్బంది లేరని హెచ్‌ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్‌ అధినేత రేవంత్‌ రెడ్డి, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీపై ఒక్కసారి కూడా చర్చించలేదు.

ప్రధానంగా ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకు రావడం లో కీలకమైన ప్లానింగ్‌ విభాగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న ఉద్యోగు లు, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖలో జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. 44 మంది ఉండాల్సిన విభాగంలో కేవలం ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారంతా అవుట్‌ సో ర్సింగ్‌, డిప్యూటేషన్‌పై వచ్చినవారే ఉన్నారు. అదే విధంగా ఏఈఈ, జూనియర్‌ అసిస్టెంట్లు, అర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్‌మెన్‌, టైపిస్టులు ఇలా 200కు పైగా ఉద్యోగుల భర్తీ తక్షణమే చేయాలని కోరింది.

అదే సమయంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో అన్ని రిటైర్డ్‌ అయ్యేవారితో వి భాగాలన్నీ ఖాళీ అవుతున్నాయని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్ర మంలో ఉద్యోగులకు వచ్చే ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని, ఉన్నత స్థాయి క్యాడర్లలో ఉండే ఉద్యోగాలకు డీ టీసీపీ, ఇతర ఇతర ఇంజనీరింగ్‌ శాఖల నుంచి ఉద్యోగులు రావడంతో, మాతృ సంస్థలో నియమితులైన ఉద్యోగులు పదోన్నతి అవకాశాలను కోల్పోతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీ ఏ పరిధిని పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం తొలుత పూర్తి స్థాయి సిబ్బంది నియామాకంపై దృష్టి పెట్టాలన్నారు. సరిపోయేంత సిబ్బంది ఉన్నప్పుడే హెచ్‌ఎండీఏ పాలనా వ్యవహారాలు మెరుగుపడతాయని, లేదంటే ఆదాయ వనరులను కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి.

 

HMDA Revanth reddy with temporary employees

 

Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news

Related posts

Leave a Comment