ఫామ్ ఆయిల్ ద్వారా అధిక లాభం | High profit through farm oil | Eeroju news

పెద్దపల్లి

రైతులు ఫామ్ ఆయిల్ పంట ద్వారా  అధిక లాభం పొందవచ్చని, ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, విదేశాల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి లో జిల్లా ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా నుండి విదేశీ శాస్త్రవేత్తలు హాజరైన రైతులకు అవగాహన కల్పించారు.

రైతులు ఫామ్ ఆయిల్ పంట సాగు చేయడంతో పాటు అంతర్ పంటలు వేసుకొని మంచి లాభాలు పొందవచ్చునని, ఈ పంట ద్వారా రైతులకు తాలు, కట్టింగ్ వంటి సమస్యలు లేవని, ప్రభుత్వం ప్రొచ్చహకంగా సబ్సిడీ అందిస్తుందని, ఈ పంటకు సంబందించిన విత్తనాలు, మలేషియా నుండి దిగుమతి చేసుకుని రైతులకు సబ్సిడీ గా అందిస్తుందని, పంటను అమ్ముకోవడానికి ఇక్కడ త్వరలో ప్రభుత్వం సహకారంతో కంపెనీని ప్రారంభిస్తామని అన్నారు. రైతు సత్యనారాయణ మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంట ద్వారా రైతులకు లాభదాయకంగా ఉందని, అంతర్ పంటలు చిన్న పంటలు వేయాలని అన్నారు.

Related posts

Leave a Comment