High Alert Application:అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్

Adding technology "High Alert Application" was developed by Anantapur District SP.

సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం ఈ యాప్ లో పంపితే చాలు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి సమాచారం క్షణాల్లో చేరుతుంది. దీనిపై స్పందించి వెంటనే సిబ్బంది, అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను సద్దుమణిదేలా చేస్తారు.

అందుబాటులోకి హై అలెర్ట్ అప్లికేషన్.

అనంతపురం, డిసెంబర్ 30
సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ” హై అలెర్ట్ అప్లికేషన్ ను అనంతపురం జిల్లా ఎస్పీ రూపొందించారు. అనంత జిల్లాలో ఎక్కడైనా చోరీలు, దోపిడీ, హత్య, చైన్ స్నాచింగు, కిడ్నాప్, తదితర ఏదైనా అత్యవసర పరిస్థితులలో అదుపు చేయడం కోసం సమాచారం ఈ యాప్ లో పంపితే చాలు. జిల్లాలోని ఉన్నతాధికారులు, సిబ్బందికి సమాచారం క్షణాల్లో చేరుతుంది. దీనిపై స్పందించి వెంటనే సిబ్బంది, అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను సద్దుమణిదేలా చేస్తారు. పోలీసు స్టేషన్ల పరిధుల పట్టింపు లేకుండా అందరూ ఏకకాలంలో అప్రమత్తమై జరిగిన ఘటనను సద్దుమణిగేలా చేస్తారు. అన్ని విభాగాల వారు ఒకేసారి సంసిద్ధులు అయ్యేలా హై అలర్ట్ అప్లికేషన్ రూపొందించారు. అత్యవసర పరిస్థితులు, కొన్ని కీలక సందర్భాలలో జిల్లా ఎస్పీ ఈ యాప్ లో ఒక క్లిక్ చేస్తే చాలు సిబ్బంది సెల్ ఫోన్లలో సైరన్ మోగుతూ ఆదేశాలు వెళ్తాయి. దీంతో జిల్లా పోలీసు సిబ్బంది ఏకకాలంలో అప్రమత్తమై సులువుగా సమస్యలను, కేసులను ఛేదించే అవకాశముంది. ఈ యాప్ ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో చాలా ఉపయోగపడుతోంది.అనంతపురం జిల్లాతో పాటు తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి తదితర మున్సిపాలిటీ పట్టణంలోని శివారు ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టు కోసం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకించి డ్రోన్లను రంగంలోకి దింపారు. బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేసి వారిని, గంజాయి సివించే వారిని, ఈవ్ టీజర్స్ ను డ్రోన్ల ద్వారా పసిగట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులు కృషి చేస్తున్నారు. పోలీసులు వెళ్లలేని పొదలలోకి, అటవీ ప్రాంతంలోకి డ్రోన్లు వెళ్లడం వల్ల ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడునుంది.17 మంది పిల్లలకు విముక్తి… తల్లిదండ్రులకు అప్పగించి మైనర్లను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమని అలాంటి మైనర్లకు పని చేసే చోటు నుండీ విముక్తి. పోలీసులు, లేబర్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగపు అధికారులు ఆపరేషన్ స్వేచ్ఛ ను ఈ ఏడాది 4 సార్లు నిర్వహించారు. వివిధ పరిశ్రమలు, దుకాణాలలో పని చేస్తున్న 17 మంది మైనర్లకు విముక్తి కల్పించి ఆయా తల్లిదండ్రులకు అప్పగించారు. 2023లో హత్యలు, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు 956 నమోదు కాగా, 2024లో 1051 కేసులు నమోదయ్యాయి. ప్రాపర్టీ క్రైం రికవరీ 51 శాతం కేసుల్లో పూర్తయింది. జిల్లాలో పోక్సో కేసులో ఈ ఏడాది 8 శాతం తగ్గాయి. లోక్ అదాలత్ లలో 10,933 చిన్న కేసులు పరిష్కారం కోసం యత్నించారు. 15 NDPS కేసులలో 63 మంది అరెస్ట్ అయ్యారు. గ్యాబింగ్, పేకాట కేసులలో రూ. 1,98,37,629 స్వాధీనం చేసుకున్నారు. డయల్ 100/112 కు వచ్చిన కాల్స్ ద్వారా వేల కేసుల్లో ఘటనా స్థలానికి వెళ్లి చర్యలు తీసుకున్నారు. 10,501 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

Read:Visakhapatnam:వైసీపీకి భారీ ఎదురుదెబ్బ

Related posts

Leave a Comment