Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations | యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్ | Eeroju news

Hero Santosh

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి హీరో సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్, టైటిల్ లుక్ రిలీజ్

Hero Santosh Shobhan’s Birthday Glimpses Released Title Look of Movie ‘Couple Friendly’ produced by UV Concepts under the banner of UV Creations

 

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మూవీ “కపుల్ ఫ్రెండ్లీ“. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా టైటిల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. “కపుల్ ఫ్రెండ్లీ” టైటిల్ లుక్ లో చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే ఇంట్రెస్టింగ్ మూవీగా “కపుల్ ఫ్రెండ్లీ” ఉండబోతోంది.
నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

 

Hero Santosh

 

Peka Medalu movie grand trailer launch event was held today movie release on 19th July | పేక మేడలు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది – జూలై 19న సినిమా విడుదల | Eeroju news

Related posts

Leave a Comment