Heavy rainfall in Vijayawada | విజయవాడలో భారీ వర్షం | Eeroju news

Heavy rainfall in Vijayawada

విజయవాడలో భారీ వర్షం

విజయవాడ

Heavy rainfall in Vijayawada

విజయవాడలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేసారు. వివిఐపిలు ను బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.. కొన్నా చోట్ల జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాలను మళ్లించారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ వద్ద కుడా వాహనాలు భారీగా నిలిచాయి. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు చేరాయి. నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లించారు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు ఇచ్చారు.

బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు నిలిచాయి. మొఘల్ రాజ్ పురంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్ లతో నీళ్ళు తొలగించే ప్రయత్నాలు చూస్తున్నారు. పాతబస్తీలో ఔట్ ఫాల్ డ్రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది.

Heavy rainfall in Vijayawada

 

Rains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news

Related posts

Leave a Comment