చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు
తిరుపతి, జూలై 22, (న్యూస్ పల్స్)
Heated politics in Chandragiri
చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ పంచాయితీ మరింత ముదురుతోంది. అంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం ఫీక్ స్టేజీకి చేరింది.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒకటేలా సాగుతోంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు వార్నింగులు కొనసాగుతున్నాయి. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు బాధ్యులు అంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది. 5 ఏళ్లలో ప్రశాంత చంద్రిగిరిని చేశానంటున్న చెవిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రగిరిలో ఒక్కరినీ కూడా ఇబ్బంది పెట్టలేదంటున్నారు. చంద్రగిరికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ వస్తే కూడా గౌరవించానంటున్న చెవిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించా నంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 34 మంది వైసీపీ శ్రేణులపై కొందరు ముసుగు ధరించి భౌతిక దాడులకు దిగారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో నియోజకవర్గ ప్రజలు జీవిస్తున్నారని, వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన సహకారంలో పులివర్తి నాని తన సొంత పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కౌంటర్ ఇచ్చారు. చెవిరెడ్డి తప్పు చేశారు కాబట్టే నింద మోపుతున్నారని ఆరోపించారు. తనపై జరిగిన దాడిలో ఆయన పాత్ర ఉందన్నారు.
సాంకేతికంగా దొరికిపోతారనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారని పులివర్తి నాని అన్నారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చెవిరెడ్డి అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కూడా కోరినట్లు చెబుతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ మళ్లీ రాజకీయాన్ని వేడెక్కించారు. అయితే చంద్రగిరి అల్లర్ల పై మాత్రం ఒక్కో పార్టీదీ ఒక్కో వాదన.
War of words between TDP and YCP | టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం | Eeroju news