తులసి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
Health Benefits of Tulsi
ASVI Health
తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే లేవగానే తులసి ఆకులను తింటే కలిగే లాభాలు ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
సీజనల్ వ్యాధులను నయం చేయడానికి తులసిని మించినది మరొకటి లేదని నిపుణులు అంటున్నారు.
వర్షాకాలంలో తులసి ఆకులను నమలడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తులసి ఆకులను నమలడం వల్ల అందులోని పోషకాల వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం మరియు మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
తులసి ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
ఈ ఆకులు రక్తపోటును తగ్గిస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తులసి ఆకులను తింటే మనసులో ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
ఈ తులసి ఆకులు దంతాలు మరియు చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
తులసి ఆకుల రసం లేదా కషాయంతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
Benefits of Coconut Water | కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు | ASVI Health