Guntur: సైలెంట్ గా జిల్లా టూర్లలలో జగన్:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది కానీ ప్రతిపక్ష నేతగా జగన్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు లేనప్పటికీ ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష నేత మాత్రం ఆయనే. దానికి తగ్గట్లుగా పోరుబాట ఎంచుకుంటారని.. అనుకున్నారు కానీ ఆయన నింపాదిగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే వరకూ వేచి చూడాలని అనుకున్నారు. అందుకే కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన జిల్లాల టూర్ పెట్టుకున్నారు.
సైలెంట్ గా జిల్లా టూర్లలలో జగన్
గుంటూరు, ఫిబ్రవరి 22
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది కానీ ప్రతిపక్ష నేతగా జగన్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు లేనప్పటికీ ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష నేత మాత్రం ఆయనే. దానికి తగ్గట్లుగా పోరుబాట ఎంచుకుంటారని.. అనుకున్నారు కానీ ఆయన నింపాదిగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే వరకూ వేచి చూడాలని అనుకున్నారు. అందుకే కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన జిల్లాల టూర్ పెట్టుకున్నారు. కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ ప్రజా సమస్యలపై మాత్రం మెల్లగా పర్యటనలు ప్రారంభించాలని డిసైడయ్యారు. జగన్ రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి వచ్చారు. రాగానే విజయవాడలో వంశీ ని జైలులో పరామర్శించారు. అక్కడ ఓ పాప ఆయన కోసం ఏడవడం.. ఆ పాపతో సెల్ఫీ దిగడం వంటి కార్యక్రమాలతో జగన్ మళ్లీ తన రాజకీయం ప్రారంభించారని వైసీపీ నేతలు అర్థం చేసుకుననారు. వెంటనే గుంటూరులో మిర్చి రైతుల పరామర్శకు అని వెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నా సరే లెక్క చేయలేదు. అనుమతి లేని పర్యటనకు పోలీసులు కూడాపెద్దగా బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఆక్కడ ఆవేశంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు.
మిర్చి కోరు కారణంగా ఇబ్బంది పడినప్పటికీ కొంత మంది రైతులతో మాట్లాడి వెళ్లారు. అక్కడ కూడా జగన్ మార్క్ కనిపించింది. జగన ఇటీవలి కాలంలో ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. వారానికి మూడు లేదా నాలుగు రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. దానికి సంబంధించి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ ఏపీకి వచ్చిన రోజుల్లో తాడేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించేవారు. అయితే ఇక నుంచి ఓ జిల్లా పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాసమస్యలను తీసుకుని ఆ సమస్య పరిశీలనకు జగన్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్లాన ను బయట పెట్టలేదు కానీ అన్ ప్లాన్డ్ గానే ఆయన ప్రజల్లోకి వెళ్తే మంచి స్పందన వస్తుందని కొత్తగా వ్యూహకర్తలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీకి హాజర్యయేందుకు సిద్ధంగా లేరు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబుతో సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తేనే వస్తానని ఆయనంటున్నారు కాబట్టి హాజరయ్యే అవకాశం లేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఏదో ఓ రాజకీయ కార్యక్రమం పెట్టుకుంటారు. గతంలో ఆయన మాక్ అసెంబ్లీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ నిర్వహించలేదు. ఈ సారి జనాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదో తన వాదన వినిపిస్తూ.. అక్కడి నుంచి ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తానని ఆయన వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
Read more:Andhra Pradesh:ఒక్క రోజే ప్లీనరీ