Guntur:బాపట్లలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

bapatla-mla-narendra-verma-vs-krishna-prasad

పట్ల జిల్లాలుగా విడిపోయింది. గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ పదవి తగ్గించుకున్నారు. పల్నాడు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. బాపట్ల ఎంపీగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కూటమి నుంచి విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది.గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరితో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు.

బాపట్లలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

గుంటూరు, జనవరి 10
పట్ల జిల్లాలుగా విడిపోయింది. గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ పదవి తగ్గించుకున్నారు. పల్నాడు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. బాపట్ల ఎంపీగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కూటమి నుంచి విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది.గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరితో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఏదైనా అధికార కార్యక్రమం గనుక గుంటూరులో నగరంలో జరిగితే తప్పకుండా ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరవుతున్నారు. ఒకటో రెండో సందర్భంలో తప్ప మిగిలిన సందర్భాల్లో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా నరసరావుపేటలో ఏదైనా కార్యక్రమం జరిగితే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.గుంటూరుతో పోలిస్తే పల్నాడు జిల్లాలో అంతగా అందరు కలిసి పనిచేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే కార్యక్రమాలకు హాజరవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంపీతో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ పల్నాడు జిల్లాలో ఉన్న నేతలంతా కూడా సీనియర్లు అవ్వడంతో వారి కార్యక్రమాలు వాళ్లే నిర్వహించుకుంటున్నారు.

బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు.. బాపట్ల ఎంపీకృష్ణ ప్రసాద్‌ల మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నప్పటికీ ఎంపీ ఆ ప్రచారం గురించి అసలు పట్టించుకోవడం లేదు. అయితే గెలిచిన రోజు నుంచి బాపట్ల పరిధిలోని ఎమ్మెల్యేలకి ఎంపీకి కొంత డిస్టెన్స్ ఉందనేది మాత్రం వాస్తవం అంటున్నారు కూటమినేతలు.. మరీ తీవ్రస్థాయి విభేదాలు లేవు కానీ, ఏదో చిన్న గ్యాప్ ఉందని అందుకే ఆ ఇద్దరు కార్యక్రమాల్లో కలిసికట్టుగా పాల్గొనడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్‌గా ఉన్నా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలందర్నీ కలుపుకుని వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితేఅలాంటి పరిస్థితి బాపట్ల జిల్లాలో బాపట్ల పార్లమెంటు పరిధిలో లేదంటున్నారు. గతంలో బాపట్ల ఎంపీలుగా గెలిచిన అనేకమంది కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు.ప్రస్తుతం ఎంపీ కృష్ణ ప్రసాద్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ విద్యాధికులు కావడం, పోలీసు అధికారిగా రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి కావడంతో బాపట్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎంపీతో ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టుకోవడం.. ఎంపీ చొరవ తీసుకుని కోఆర్డినేషన్ మీటింగులు పెట్టడం కాని జరగకపోతుండటంతో ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన వర్మ, ఎంపీ కృష్ణ ప్రసాద్‌ల మధ్య గ్యాప్‌పై తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాత్రం అటువంటిదేమీ లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండస్తున్నారు.అయితే ఎవరు ఏ కార్యక్రమంలో కలిసి పాల్గొనక పోవడం, ప్రజా సమస్యలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకోకపోవడం వల్లే అలాంటి ప్రచారం జరుగుతుంని స్థానికులు అంటున్నారు. మరి ఆ ఇద్దరు అలాంటి ప్రచారాలకి ఫుల్‌స్టాప్ పెట్టేలా కలిసి కనిపిస్తారోలేదో చూడాలి.
Read:Visakhapatnam:స్టీల్ ప్లాంట్ పై నోరు విప్పని మోడీ

 

Related posts

Leave a Comment