Guntur:ఫిబ్రవరి 5న ఫీజు పోరు

Fee fight on 5th February

Guntur:ఫిబ్రవరి 5న ఫీజు పోరు:కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని.. వైసీపీ ఆరోపించింది. తాము విద్యార్థులకు అండ‌గా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 5న ‘ఫీజు పోరు’ పేరుతో ఉద్యమానికి రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు.

ఫిబ్రవరి 5న ఫీజు పోరు

గుంటూరు, ఫిబ్రవరి 1
కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని.. వైసీపీ ఆరోపించింది. తాము విద్యార్థులకు అండ‌గా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 5న ‘ఫీజు పోరు’ పేరుతో ఉద్యమానికి రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు. జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా.. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో.. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా దీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్‌షిప్‌.. రెండూ కలిపి దాదాపు రూ.3900 కోట్లు బకాయి పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. కొన్ని చోట్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులను క్లాస్‌లకు రానివ్వడం లేదని.. మరికొన్ని చోట్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పేద విద్యార్ధులు చదువులు మానుకుని కూలీ చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పేద విద్యార్ధి ప్రపంచ స్థాయిలో అవకాశాలకు పోటీ పడాలని ఆనాడు సీఎంగా జగన్‌ భావిస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు విద్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వైసీపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు.వైఎస్సార్ పక్కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేశారు. నిరుపేద కుటుంబాలకు వారి పిల్లల ఫీజులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత జగన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మరింత పటిష్టంగా అమలు చేశారు. 2019లో చంద్రబాబు రూ.2800 కోట్లు బకాయిలు పెట్టి దిగిపోయారు. సీఎంగా జగన్‌ ఆ బకాయిలు చెల్లించారు. జగన్‌ కంటే ఇంకా ఎక్కువగా మేలు చేస్తామంటూ గత ఎన్నికల్లో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తీరా గద్దెనెక్కిన తరువాత విద్యార్ధుల ఉసురు పోసుకుంటున్నారు’ అని వైసీపీ విమర్శించింది.ప్రతిపక్షంగా వైసీపీ ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా ప్రభుత్వ మెడలు వంచి విద్యార్ధులకు న్యాయం జరిగేలా పోరు కొనసాగిస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఇప్పటికైనా విద్యార్ధులను ఆదుకునేందుకు ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తేదీ లోగా మొత్తం బకాయిలను చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను ఎగ్గోట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న దిగజారుడు రాజకీయాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు’ అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Leave a Comment