Guntur:పల్పాడులో పొలిటికల్ హీట్

Political heat in Palpadu

Guntur:పల్పాడులో పొలిటికల్ హీట్:పల్నాడు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతో తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని ఫైర్ అయ్యారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రత్తిపాటి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.మాజీమంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు.

పల్పాడులో పొలిటికల్ హీట్

గుంటూరు, ఫిబ్రవరి 10,
పల్నాడు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతో తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని ఫైర్ అయ్యారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ప్రత్తిపాటి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.మాజీమంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. విడదల రజినికి పీఏలుగా పనిచేసిన జయ ఫణీంద్ర, రామకృష్ణ, చిలకలూరిపేట అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటకు చెందిన టీడీపీ దళిత నాయకుడు పిల్లి కోటి 2019లో విడదల రజినిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. రజిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోస్టులు పెట్టారు. అందుకుగాను పిల్లి కోటిని 5 రోజులు పాటు చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పిల్లి కోటి ఫిర్యాదుతో పోలీసులకు తాజాగా కేసు నమోదు చేశారు.తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ అయ్యారు. చిలకలూరిపేటలో శనివారం మీడియాతో మాట్లాడుతూ… ప్రత్తిపాటి పుల్లారావు ఒక అందమైన కట్టు కథ తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని ఆరోపించారు. 80 ఏళ్ల పైబడిన తన మామగారిపై, ఎక్కడో విదేశాల్లో ఉంటున్న తన మరిదిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. అక్రమ కేసులు పెట్టించి తన కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.”పుల్లారావు గుర్తుపెట్టుకో, నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30-40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయినా, నువ్వెక్కడ దాక్కున్నా కచ్చితంగా నిన్ను లాక్కురావడం ఖాయం. ఆ రోజు వడ్డీతో సహా చెల్లిస్తాను. నా కుటుంబం జోలికి వచ్చినా, మా కార్యకర్తలు, నాయకులు జోలికి వచ్చినా సహించిలేదు. 2019లో జరిగిన ఘటనకు అందమైన కట్టు కథ అల్లి నాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. హైకోర్టు నమోదు చేయమన్నదని చెబుతూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు”- విడదల రజిని

పాలనలో అభివృద్ధిపై దృష్టి పెడితే, ఎన్డీయే ప్రభుత్వంలో పుల్లారావు అరాచకంపై దృష్టి పెట్టారని మాజీ మంత్రి రజిని విమర్శించారు. అధికారంలో ఉన్నామని ఎగిరెగిరి పడుతున్న టీడీపీ నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైలుకు పంపిస్తే కచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్ గా మారిందని విడదల రజిని ఆరోపించారు.మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యలపై మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. విడదల రజిని చిలకలూరిపేటలో అరాచకాలు చేసి ఎన్నికల్లో గుంటూరుకు పారిపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ దిక్కుతోచని స్థితిలో చిలకలూరిపేటకి వచ్చారని ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటలో తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేయించి గుంటూరు పారిపోయిన విషయం తెలిసిందే అన్నారు. గత ఎన్నికల్లో నమ్మి ఓటేసిన చిలకలూరిపేట వాసులను పూర్తిగా నాశనం చేశారన్నారు. ఈ 7 నెలలు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్ని్ంచారు. విడదల రజిని అరాచకాలు మొత్తం బయటకు తీసి, తిన్నదంతా కక్కిస్తామని పుల్లారావు అన్నారు.”చిలకలూరిపేటకు, బీసీలకు రజిని తీరని అన్యాయం చేశారు. ఐదేళ్లకే దిక్కులేని రజినికి 30 ఏళ్ల రాజకీయం సాధ్యమేనా. అన్నేసి ఏళ్లు రజిని అసలు రాజకీయాల్లో ఉంటారా? ఓట్లేసిన చిలకలూరి ప్రజలను మోసం చేశావు. నమ్ముకుని పనిచేసిన నాయకుల్ని నట్టేట ముంచావు. 2019 ఎన్నికల్లో నాన్న, బాబాయ్ అని పిలిచి మోసం చేసి గుంటూరు పారిపోయావు. మళ్లీ ఇప్పుడు ఒక బీసీ, ఒక మహిళను అంటూ మాట్లాడుతున్నావు. నువ్వు అసలు మహిళవేనా?” అంటూ ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు వ్యాఖ్యలుచేశారు.

Read more:Visakhapatnam:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలోదారి

Related posts

Leave a Comment