జీవీఎల్ నరసింహారావు.. ఐదేళ్ల క్రితం వరకు ఆయనెవరో తెలియదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేట్ అయి విశాఖలో తిష్టవేసి రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. ప్రెస్మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ తెగ హడావుడి చేసేవారు.
జీవీఎల్ గాయాబ్..
గుంటూరు, జనవరి 23
జీవీఎల్ నరసింహారావు.. ఐదేళ్ల క్రితం వరకు ఆయనెవరో తెలియదు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ నామినేట్ అయి విశాఖలో తిష్టవేసి రాజకీయాలు చేస్తూ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. ప్రెస్మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ తెగ హడావుడి చేసేవారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. మాజీ ఎంపీ అయిపోయారు జీవీఎల్.దాంతో ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పత్తా లేకుండా పోయారు జీవీఎల్. బీజేపీ కార్యక్రమాల్లో గానీ, ఇటు కూటమి యాక్టివిటీలో కానీ కనిపించడం లేదు. చివరకు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చినా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. వైసీపీ హయాంలో మోదీ విశాఖకు వస్తే జీవీఎల్ తెగ హడావుడి చేసేవారు. ప్రధాని ప్రసంగాన్ని కూడా ఆయనే తెలుగులోకి అనువాదం చేశారు. ఇటీవల మోదీ విశాఖ టూర్‌కు వస్తే జీవీఎల్ కానరాకపోగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని స్పీచ్‌ను తెలుగులోకి అనువదించారు.పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించి విశాఖ ప్రజలను జీవీఎల్ ఆహ్వానించారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మళ్లీ తెరమీదకు వచ్చే ప్రయత్నం స్టార్ట్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు ముందు జీవీఎల్ ఇదే వేదికగా సంక్రాంతి సంబరాలతో హడావుడి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి చందాలు తెచ్చి పండుగ పేరుతో ఆర్భాటం చేశారటన్న టాక్ కూడా ఉంది.
ఎన్నికల ముందు కనుమరుగైన జీవీఎల్ మళ్లీ సంక్రాంతి సంబరాలతో ప్రత్యక్షం కావడం టాపిక్ మారింది. దాదాపుగా ఏడాది తర్వాత విశాఖలో సంక్రాంతి సెలబ్రేషన్స్‌తో ఆయన రీఎంట్రీ ఇవ్వడం వెనుక కారణమేంటన్న దానిపై ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా సంబరాలు ఎందుకు నిర్వహిస్తారన్న చర్చ జరుగుతోంది.అయితే ఇందుకు బలమైన కారణమే ఉందట. ఎన్నికలకు ముందు ప్రజల్ని ఆకర్శించేందుకు వేడుకలు చేసి, ఇప్పుడు చేయకపోతే రాజకీయ అవకాశవాది అనే ముద్ర పడే ప్రమాదం ఉందని భావించి ఈ సారి కూడా వేడుకలు చేసి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి ట్రిక్స్ చేయడం షరా మామూలేనని బీజేపీ వర్గాలు కూడా లైట్ తీసుకుంటున్నాయట.యూపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన జీవీఎల్ నరసింహారావు..ఆ తర్వాత విశాఖలో నివాసం ఏర్పాటు చేసుకుని, ఆఫీసు పెట్టి యాక్టివిటీ నడిపించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారట. టీడీపీ, జనసేన జతకట్టినా విశాఖ ఎంపీ టికెట్ తనకే వస్తుందంటూ గ్రౌండ్ వర్క్ కూడా చేశారు.కుల సంఘాల నేతలతో సమావేశాలు పెట్టి, బీసీ కోటా కోసం వారిని ఢిల్లీకి తీసుకువెళ్లడంతో పాటు, రైల్వే సంబంధిత ఇష్యూస్‌పై అధికారులతో సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం, కేంద్రం నుంచి నిధులు తెస్తానంటూ హడావుడి చేశారు. కూటమిలో టీడీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా భరత్ పేరు ఖరారైనా సరే టికెట్ తనకే వస్తుందంటూ విశాఖలో స్వాగత ర్యాలీలు కూడా చేయించుకున్నారు. కానీ చివరకు జీవీఎల్‌కు ఆశాభంగం తప్పలేదు. ఎప్పుడైతే టికెట్ దక్కలేదో విశాఖలో పత్తా లేకుండా పోయారు. పార్టీ మీటింగ్‌లలో కూడా కనిపించడం మానేశారు జీవీఎల్.సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహరావు మళ్లీ తెరమీదకు రావడం అయితే ఆసక్తికర చర్చకు దారి తీసింది. అవకాశవాద రాజకీయ నాయకుడు అనే ముద్ర తొలగించుకోవడానికే ఈ వేడుకలు చేశారా..సరికొత్తగా మరో పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారా..? అన్నది ఆసక్తి రేపుతోంది. జీవీఎల్ రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయో వేచి చూడాలి మరి.