Guntur:ఏపీలో వైరల్ అవుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్స్

Social media campaigns going viral in AP

సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ న‌యా ప్రచారాన్ని ప్రారంభించింది. సోష‌ల్ మీడియాను మంచికి వాడుదామంటూ భారీ హోర్డింగ్‌ల‌తో ప్రజ‌ల‌కు పిలుపు ఇస్తుంది. మరోవైపు సినీ సెల‌బ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

ఏపీలో వైరల్ అవుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్స్

గుంటూరు, జనవరి2
సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ న‌యా ప్రచారాన్ని ప్రారంభించింది. సోష‌ల్ మీడియాను మంచికి వాడుదామంటూ భారీ హోర్డింగ్‌ల‌తో ప్రజ‌ల‌కు పిలుపు ఇస్తుంది. మరోవైపు సినీ సెల‌బ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాను మంచి కోస‌మే ఉప‌యోగించుకోవాల‌ని, అంతే త‌ప్పా త‌ప్పుడు ప్రచారంతో ఇత‌రుల ప‌ట్ల ద్వేషం ప్రద‌ర్శించొద్దని కోరుతున్నారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం, విద్వేష, విషపూరిత రాతలు వద్దని కోరుతోంది. చెడు పోస్టులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది. అస‌త్య ప్రచారాల‌కు, దూష‌ణ‌ల‌కు స్వస్తి ప‌లుకుదామంటూ ప్రజ‌ల‌కు పిలుపు ఇస్తోంది. సోషల్ మీడియాపై ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచేలా పోస్టులు చేయాల‌ని సూచిస్తోంది. సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ పలు నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే ఆటోల‌పై పోస్ట‌ర్లు అతికించి ప్రచారం చేస్తోన్నారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేస్తోంది.త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు ప్రభుత్వం పెట్టింది. పోస్ట్ నో ఈవిల్ (చెడు పోస్టు వ‌ద్దు) పేరుతో నాలుగో మంకీ బొమ్మతో భారీ హోర్డింగ్‌ల ఏర్పాటు చేశారు. మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్ పీరియన్స్ పేరుతో ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ పెట్టారు.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, విధ్వేష, విషపూరిత రాతలు వద్దంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను మంచికి, పాజిటివ్ అంశాలకు వేదికగా మార్చుదామ‌ని అనే స్లోగన్‌తో పిలుపు ఇస్తున్నారు.విజయవాడ- గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద భారీ హోర్డింగ్‌ల పెట్టారు. రాజధాని అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫ్లెక్లీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ప్ర‌ద‌ర్శించారు. సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని, వ్యక్తిత్వ హననాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం, ఈ త‌ర‌హా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే బూతులు, మార్ఫింగ్‌లతో పోస్టుల పెట్టిన వారిపై ఇప్పటికే ప్ర‌భుత్వం కఠిన చర్యలకు దిగింది. సోషల్ మీడియాపై ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచేలా తాజాగా క్యాంపెయిన్ నిర్వ‌హిస్తోంది.ఈ క్యాంపెయిన్‌లో హీరో, హీరోయిన్ సినీ ప్రముఖులు భాగ‌స్వామ్యం అయ్యారు. శ్రీలీల, అడ‌వి శేషు, అఖిల్ త‌దిత‌ర న‌టీన‌టులు కూడా ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ శ్రీ‌లీల వీడియో విడుద‌ల చేశారు. “లైక్స్ కోసం, వ్యూస్ కోస‌మ‌ని త‌ప్పుడు వార్తాల‌ను ప్రచారం చేయొద్దు. మీ వ్యూస్ కోసం ఇంకొక‌రిని యూజ్ చేసుకోవ‌ద్దు. అసత్య ప్రచారాల‌కు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వ‌హిద్దాం” అంటూ పేర్కొన్నారు.హీరో నిఖిల్ విడుద‌ల చేసిన వీడియోలో “మ‌నం ఒక వ‌స్తువు కొనేట‌ప్పుడు ఎలాగైతే ఎక్స్‌పైర్ డేట్ చూస్తాం. కానీ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేట‌ప్పుడు అది నిజ‌మా? కాదా? అని ఎందుకు చెక్ చేయం. ఎందుకంటే ఏమ‌వుతుందిలే అనే క్యాజువ‌ల్‌గా తీసుకుంటాం. కానీ మీరు స‌ర‌దాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాల‌ను నాశ‌నం చేస్తోంది. క‌నుక మీరు న్యూస్ షేర్ చేసేముందు, అది నిజ‌మా? కాదా? అని ఒక‌సారి చెక్ చేసుకోండి. సోష‌ల్ మీడియాను ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డేలా వాడుదాం. అంతేత‌ప్ప ఇబ్బందిపెట్టేలా కాదు” అంటూ పేర్కొన్నారు.న‌టుడు అడ‌వి శేషు విడుద‌ల చేసిన వీడియోలో “ఏమ‌వుతుందిలే అనుకుని ఒక అమ్మాయి పోస్టు కింద చెడ్డ కామెంట్ పెడితే, అది చ‌దివి వారు ఆందోళ‌న చెందుతారు. ఏం కాదులే అనుకుని ఫేక్ న్యూస్ షేర్ చేస్తే, అదే నిజ‌మ‌ని చాలా మంది అనుకుంటారు. సో కాస్తా ఆలోచిద్దాం. బాధ్య‌త‌గా ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు. చెడ్డ కామెంట్లు పెట్టొద్దు” అని అన్నారు. మ‌రోవైపు జ‌న‌సేన పార్టీ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా క్యాంపెయిన్ నిర్వ‌హిస్తోంది.
ఉద్యమం చేస్తున్నది ఎవరు
అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న చిన్న పోస్టర్లు కాదు ఏకంగాపెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్థాలు.. మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలన్న చర్చ కూడా వస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వీటిని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. సినిమా తారలతోనూ ప్రచారం చేయిస్తున్నారు. సలహాలు, నీతులు ఉరకనే చెబుతారు. భారీ హోర్డింగ్‌లకు వేలల్లో వసూలు చేస్తారు ఇలా అన్ని సిటీల్లో వేయాలంటే లక్షలు ఖర్చవుతుంది. అయినా ఎవరూ ఖర్చు పెట్టి చెప్పరు. కానీ ఏపీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఎవరి పేర్లు లేవు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే జారీ చేసిన వారు సమాచార, ప్రచార సంబంధాల శాఖ అని వేసుకునేవారు. కానీ అలా వేయలేదు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి ఉంటే అంత ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేసుకోవడం లేదు.

Read:Ongole:కల్లు గీత కార్మికులకు 340 షాపులు

Related posts

Leave a Comment