గ్రేటర్ కు లేడీ సింగం
హైదరాబాద్, జూన్ 25, (న్యూస్ పల్స్)
Greater to Lady Lion
తెలంగాణ ప్రభుత్వం వారం వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. గత వారం 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా అమ్రపాలిని నియమించింది. ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌కో కమిషనర్‌గా బదిలీ చేసింది. తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకన్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, HGCL మేనేజింగ్ డైరెక్టర్ , హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా కూడా ఉన్నారు. ఆయా పోస్టుల్లో కొత్తగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో కీలక బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని అనుకోవచ్చు. కాట అమ్రపాలి 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. చెన్నై ఐఐటీ నుంచి బీటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
అనంతరం 2010 యూపీఎస్‌లో ఆలిండియా 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు. ఈ కారణంగా సొంత రాష్ట్ర క్యాడర్‌నే కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించారు. 2013లో వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో కొన్నాళ్లు వరంగల్ కలెక్టర్ గా వ్యవహరించారు. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆమ్రపాలి, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటీషన్ వెళ్లారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారుఅమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నారు. ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రొనాల్డ్ రాస్ సెలవుపై వెళ్లగా అమ్రపాలిని ఇన్చార్జిగా నియమించారు.
ఆ సమయంలో విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రజల ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో ఆమెను పూర్తి కమిషనర్‌గా నియమిస్తే సమర్థవంతగా పనిచేస్తారని భావించి ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది.అమ్రపాలి సొంత గ్రామం ఒంగోలు నగర చివరన ఉన్న ఎన్.అగ్రహారం. కాటా వెంకటరెడ్డి–పద్మావతి దంపతుల మొదటి సంతానం. విశాఖలో ఉన్నత చదువులు చదివారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో 2010 ఏఐఎస్ బ్యాచ్‌కు చెందిన అమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే కేటాయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర సర్వీస్‌లకు వెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తిరిగి రాస్ట్రానికి వచ్చారు.అమ్రపాలి తన పనితీరుతో లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విధు నిర్వహణలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. అవతలి వాళ్లు ఎలాంటి వారైనా, ఆమె చట్ట ప్రకారం పనిచేసుకుపోతారు. ఎవ్వరినీ కేర్ చెయ్యరు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు.
గతేడాది హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 7,200 చదరపు కిలోమీటర్లు, ఏడు జిల్లాల పరిధిలో ఉన్న హెచ్ఎండీఏపై తన మార్కు వేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ప్రమోషన్ లభించింది..జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అమ్రపాలి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సిటీ వేగంగా విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. కుక్కల పెడద పెరిగింది. వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మ్యాన్ హోళ్లు, డ్రెయినేజీలు ప్రమాదకరంగా మారతాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది.ఇక ఆమ్రపాలి భర్త సమీర్ శర్మ ఐపీఎస్ అధికారి. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకున్నారు. సమీర్ శర్మది జమ్మూకశ్మీర్. ప్రస్తుతం ఆయన డామన్, డయ్యూలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.
పమేలా సత్పతికి …అదే ప్లేస్
నాలుగు రోజుల క్రితమే 18 జిల్లాల కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరోమారు బదిలీలు చేసింది. ఈ క్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని ఇటీవల బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతిని నియమించింది. అయితే తాజా బదిలీల్లో పమేలా సత్పతిని కొనసాగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అనురాగ్ జయంతిని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయ జోనల్ కమిషనర్‌గా నియమించారు.కరీంనగర కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ నిలిచిపోవడం వెనుక ఏం జరిగిందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పమేలా సత్పతిని కరీంనగర్ కలెక్టర్‌గా నియమించింది. ఆమె సారథ్యంలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. మరోవైపు కలెక్టర్ పనితీరుపై కూడా ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేవు. ఈ నేపథ్యంలో ఆమెనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పమేలా సత్పతి బదిలీపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒత్తిడి చేశారని తెలుస్తోంది.
కలెక్టర్ పనితీరు బాగున్నందున ఆమె బదిలీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల బదిలీ అయినా.. ఆమె విధుల నుంచి రిలీవ్ కాలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా బదిలీల్లో పమేలా సత్పతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిసింది.కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పైరవీలు అంటే అసలే పడదు. ఏదైనా పని మీద వచ్చేవారు ఎవరితోనైనా పైరవీ చేసుకొని వస్తే కలెక్టర్‌కు అసలు నచ్చదు. సమస్య పరిష్కారానికి డైరెక్టుగా వెళితే మాత్రం పరిష్కారానికి చొరవ చూపిస్తుంటారు. అధికారులు సైతం వనికి పోతుంటారు అర్హులైన వారు జెన్యూన్‌గా ఉంటే కచ్చితంగా సమస్య పరిష్కారానికి ముందుగా చర్యలు తీసుకుంటారు. అసలైన పేదలకు అన్యాయం జరగవద్దని నిత్యం సమావేశంలో చెబుతూనే ఉంటారు. అవినీతిని మాత్రం సహించరు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో ప్రధానంగా కృషి చేస్తున్నారు. ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు.
Controversy in transfers of IAS officers | ఐఏఎస్ అధికారుల బదిలీలలో తిరకాసు | Eeroju news