హైడ్రా కూల్చివేతలలో ప్రభుత్వం పురాలోచన..!
హైదరాబాద్
Govt in Hydra demolitions
ఓవైపు అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ మరోవైపు చెరువులు ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలు వాటిని వ్యతిరేకిస్తూ బాధి తుల నుంచి నిరసనలు పెరిగిపోవడంతో ప్రభుత్వ అధికార వర్గాలు పురాలోచనలో పడ్డాయి.
దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించా లని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గ్రేటర్‌లోని చెరువుల విస్తీ ర్ణం, ఎఫ్ టి ఎల్ బఫర్‌జోన్, లను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. అయితే సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే ఎఫ్టీఎల్,బఫర్ జోన్ లో ఆక్రమణలు హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ కూల్చివేత లపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే విచారణ సందర్శంగా చెరువుల ఎఫ్.టి.ఎల్ పరిధిని నిర్ధారించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది
హైకోర్ట్. ఈ క్రమంలోనే ముందుగా ఎఫ్ టీఎల్,బఫర్ జోన్ లను గుర్తించాలని ఆదేశించింది ప్రభుత్వం. మరి అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు ఉంటాయా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.