ఈ సారి ఉద్యోగులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ, జూలై 8, (న్యూస్ పల్స్)
Good news for employees this time
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ (బడ్జెట్ 2024) ప్రవేళపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. జూలై 22న పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. అయితే తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ సారి బడ్జెట్ లో పీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇవ్వొచ్చని, వేతన పరిమితిని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల వేతన పరిమితిని పెంచవచ్చని ఒక నివేదిక పేర్కొంది. దశాబ్దకాలంగా ఈ పరిమితిని రూ.15,000గా ఉంచిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్నేళ్లుగా ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వం ఈ పరిమితిని రూ.25 వేలకు పెంచే అవకాశం ఉందని ఇందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలుస్తోంది.
చివరి మార్పు 2014, సెప్టెంబర్ లో జరిగింది
పీఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతిచ్చే పొదుపు, విరమణ నిధి. ఇది సాధారణంగా ఉద్యోగులు, వారి యజమాన్యుల భాగస్వామ్యంతో స్థాపించబడుతుంది. ఉద్యోగి, కార్మికుల విరమణ సమయంలో ఆర్థిక భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇది ఉద్యోగులకు సురక్షితమైన, పన్ను-ప్రభావవంతమైన విరమణ ప్రయోజనాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రావిడెంట్ ఫండ్ పరిమితి ప్రస్తుతం రూ.15,000 గా ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి కింద కంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితిని కేంద్రం చివరిసారిగా 2014, సెప్టెంబర్ 1న రూ.6,500కు సవరించింది.
ఈపీఎఫ్ 1 ముఖ్యమైన విషయాలు
1 ఉద్యోగులు, కార్మికుల కోసం కేంద్రం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకం ఇది.
2. మీ జీతం నెలకు రూ.15,000 అయితే ఈ స్కీమ్ లో చేరడం తప్పనిసరి.
3. మీరు ఉద్యోగం చేస్తే, మీ కంపెనీ మీ జీతం నుంచి కొంత భాగాన్ని మీ ఈపీఏపీ ఖాతాలో వేస్తుంది.
4. ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వ నిధిలో ఉంటుంది. అవసరమైన సమయంలో వడ్డీతో ఉపయోగించవచ్చు.
5. మీ కంపెనీ మీకు ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్ ఇస్తుంది. ఈ ఖాతా నెంబరు కూడా మీకు బ్యాంకు ఖాతా వంటిది, ఎందుకంటే మీ డబ్బు మీ భవిష్యత్తు కోసం ఇందులో ఉంది.
వేతన పరిమితిని ఎప్పుడు, ఎంత పెంచారు..
1 నవంబర్, 1952 నుంచి 31 మే, 1957 వరకు రూ.300
1 జూన్, 1957 నుంచి 30 డిసెంబర్, 1962 రూ.500
31 డిసెంబర్, 1962 నుంచి 10 డిసెంబర్, 1976 రూ.1000
11 డిసెంబర్, 1976 నుండి 31 ఆగస్టు, 1985 రూ.1600
1 సెప్టెంబర్, 1985 నుంచి అక్టోబర్ 31, 1990 రూ.2500
1 నవంబర్, 1990 నుండి 30 సెప్టెంబర్, 1994 రూ.3500
1 అక్టోబర్, 1994 నుండి 31 మే, 2011 వరకు రూ.5 వేలు
1 జూన్, 2001 నుండి 31 ఆగస్టు, 2014 వరకు రూ.6500
ప్రస్తుతం 1 సెప్టెంబర్ 2014 నాటికి రూ.15 వేలు
ఈపీఎఫ్ఓ చట్టాన్ని పరిశీలిస్తే ఏ ఉద్యోగికైనా బేస్ పే, డీఏలో 12 శాతం పీఎఫ్ ఖాతాలోనే ఉంటుంది. దీనిపై సంబంధిత కంపెనీ కూడా అదే మొత్తాన్ని అంటే 12 శాతం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే కంపెనీ చేసిన కంట్రిబ్యూషన్ లో 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాకు, మిగిలిన 8.33 శాతం పెన్షన్ స్కీమ్ కు వెళ్తోంది.
మోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news