Good days for the farmers of Madanapally | మదనపల్లి రైతులకు మంచి రోజులు | Eeroju news

Good days for the farmers of Madanapally

మదనపల్లి రైతులకు మంచి రోజులు

తిరుపతి, జూన్ 24, (న్యూస్ పల్స్)

Good days for the farmers of Madanapally:

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టమోటా పంట ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఎర్రబంగారంగా పిలుచుకునే ఈ టమోటో పంటకు మదనపల్లి మార్కెట్ ఆసియా ఖండంలోనే అత్యధిక టమోటో ఉత్పత్తి చేసే మార్కెట్ గా పేరు సంపాదించింది. గత కొన్ని రోజులుగా టమోట ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారింది. గత ఏడాది మార్కెట్లో టమోటా ధర రూ.200 దాటడం తెలిసిందే. ఏ రాష్ట్రంలోనూ టమోటా అంతగా లేదు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల టమోటో పంట సాగు చేస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతమైన మదనపల్లి సమీపంలోని మండలాల్లో అత్యధికంగా టమోటా పడ్డ సాగుతుంది. గత ఏడాది జూన్ నెలలో 14 వేల క్వింటాళ్ల సరుకు మదనపల్లి మార్కెట్ నుంచి వెళ్లింది. ఈ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టమోటో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని మార్కెట్ కమిటీలు సైతం టమోట మార్కెట్లు నిర్వహిస్తోంది అంటే ఏంత మేర పంట సాగవుతుందో అర్థమవుతోంది.నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిన పలు రాష్ట్రాలలో వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు పడ్డాయని సంతోషించే లోపు అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నీటిపాలు అయ్యింది. అనుకోని విధంగా తెల్ల పురుగు వైరస్ సోకి పంట దిగుబడి తగ్గిపోయింది. గాలుల ప్రభావం తో పంట నేలపాలు కాగా వర్షం నీటిలో పడి అవి పాడైపోయి పంట నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోట రైతులకు మాత్రం వర్షా కాలం తక్కువ వర్షాలు కురవడం అదృష్టంగా చెపొచ్చు.

పలు రాష్ట్రాల్లో టమోటో ఉత్పత్తి తగ్గడంతో జిల్లాలోని టమోటా రైతుల పంటకు మంచి ధర వస్తుంది. ఇక్కడ కూడా పంట దిగుబడి తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే జూన్ వరకు 5 నుంచి 7వేల మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మదనపల్లి మార్కెట్ కు వచ్చింది.కొన్ని సంవత్సరాల కాలంగా టమోటో సాగు చేస్తున్న రైతులు తక్కువ ధర.. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో రోడ్డుపై పారవేసి ఆత్మహత్యలకు పూనుకున్న పరిస్థితుల నుంచి ప్రస్తుతం లాభాల బాటకు రైతులు వెళుతున్నారు. అయితే గతంలో నష్టపోయిన పరిస్థితి నుంచి అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే ఈ టమోటా అధిక ధర ఉపయోగపడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలో కొత్త పంట చేతికి అంది వచ్చే అవకాశం ఉన్న క్రమంలో రైతుల మద్దతు ధరను కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మాత్రం రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ గా మదనపల్లె టమోటా మార్కెట్ గుర్తింపు పొందింది. మదనపల్లె మార్కెట్ నుంచి ఆశా ఖండంలోని వివిధ దేశాలకు టమోటా ఎగువతులు జరుగుతుంటాయి.

ఇతర దేశాలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, దళారుల ఇష్టానుసారం ధరలు పెంచి అక్కడ మరింత అధిక రేట్లు అమ్ముకునే విధంగా ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. అదే కారణంతో రాష్ట్రం వ్యాప్తంగా టమోటా ధరలు అత్యధికంగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మార్కెట్ ధర 100 నుంచి 120 వరకు పెరగగా, మార్కెట్ ధరతో పాటు దళారి వ్యవస్థ తీవ్రంగా రైతుల పాలిట శాపంగా మారింది. రైతులకు గిట్టుబాటు ధర మాత్రమే అందిస్తూ వారి కడుపు కొడుతున్నారు. ప్రస్తుతం 25 కేజీల టమోటో బాక్సు 2200 నుంచి 2500 వరకు పంట దిగుబడి బట్టి వేలంలో పాడుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, బిహార్, కేరళ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, బాంగ్లాదేశ్, బొంబాయి ఇలా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. జూలై రెండో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనబడుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో టమోట ధరలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల కిలో 80 నుంచి 100 పలుకుతుంది.

పంట దిగుబడి తగ్గి ధరలు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే సబ్బీడి ధరకు విక్రయాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ కు ఆదేశాలు జారీ చేసింది. అదే తడవుగా రాష్ట్రంలోని రైతు బజార్లకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి టమోట పంటను రూ. 55 నుంచి 60 లోపు కొనుగోలు చేసి పంపారు. పది రోజుల్లో 30 టన్నుల టమోటలను కొని కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు పంపిణీ చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రతి జిల్లాకు ఐదు లక్షలు రూపాయలు రివర్స్ఇన్ ఫన్ ఇవ్వబోతున్నారు. చాల జిల్లాలకు ఈ పంట చేరుకున్న ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో సబ్సిడీ పంట ప్రజలకు అందుబాటులోకి రాలేదు. దీని పై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని నూతన ప్రభుత్వానికి ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

Good days for the farmers of Madanapally

రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం | Cabinet meeting to finalize the procedures for the implementation of farmer loan waiver | Eeroju news

 

Related posts

Leave a Comment