Gold prices | షాకిస్తున్న బంగారం ధరలు | Eeroju news

షాకిస్తున్న బంగారం ధరలు

షాకిస్తున్న బంగారం ధరలు

ముంబై, అక్టోబరు 18, (న్యూస్ పల్స్)

Gold prices

గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగుతున్నాయ్. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గడిచిన ఒక్క రోజులో ఏకంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 460 మేరకు పెరగగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తులనికి రూ. 500 పెరిగాయి. అటు వెండి ధర కూడా కిలోపై రూ. 200 మేరకు పెరిగింది. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఎంతో కొంత తమ వద్ద ఉండాలని భావిస్తారు. బంగారాన్ని ఆభరణాలుగా ధరించడమే కాదు.. బంగారం ఉంటే ఒక భరోసాగా భావిస్తారు.

ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. మహిళలు, పురుషులు అని తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు బంగారం ధరించేందుకు ఇష్టపడుతున్నారు. మన దేశంలోని ప్రతి ఏటా టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంటుంది. అయితే, ఇటీవలి కాలంలో బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మార్చి నెల ప్రారంభం నుంచి అయితే, అస్సలు తగ్గేదేలే అన్నట్లు పరుగులు పెడుతోంది గోల్డ్.బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్. స్టాక్ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు దీపావళి పండుగ దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో మహిళలు షాక్‌కు గురయ్యారు. అయితే బంగారం ధరలు పెరగడం, తగ్గడం రోజు జరుగుతూనే ఉంటుంది. కానీ గత రెండు రోజుల నుంచి వరుసగా ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.870 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,980కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.800 పెరగడంతో రూ.72,400 పలుకుతోంది.

కిలో వెండి విషయానికొస్తే.. కేజీ సిల్వర్ రేటు రూ.2వేలు పెరిగి రూ.1,05,000 వద్ద ట్రెండ్ అవుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఒడిదుడుగులు, బంగారం స్టోరేజీ ఆధారంగా రేట్లపై ప్రభావం చూపుతోంది.మరోవైపు.. అమెరికాలో ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే సంకేతాలను ఇచ్చారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కారణంగా బంగారం ధర రూ.80 వేలకు చేరుతుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రకటించింది. ఒక వేళ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారితే, సేఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ కు డిమాండ్ పెరుగుతుందని జీజేసీ చెప్పినట్లు తెలిపింది. ఈ కారణంగానే అంచనాలకు మించి ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

షాకిస్తున్న బంగారం ధరలు

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం గోల్డ్ రూ.78వేలు | Eeroju news

Related posts

Leave a Comment