Germany | ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు | Eeroju news

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు

శ్రీకాళహస్తి సెప్టెంబర్ 26

Germany

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులుశ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం పరదేశీయులు సందడి చేశారు. సంప్రదాయ దుస్తులతో జర్మనీ దేశానికి చెందిన 56 మంది బృందంగా ముక్కంటి శుని దర్శనం కోసం తరలివచ్చారు. దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆలయంలో రద్దీ ఉన్నప్పటికీ వీళ్లకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యస్వామి, స్వామి అమ్మ వార్ల తో పాటు శని భగవానుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు ఇక్కడి ఆలయ శిల్పకళ సౌందర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పురాతన కాలంలో నిర్మించిన గోపురాలు ఆలయంలో స్తంభాలపై చెక్కిన శిల్ప కళ ల ను చూసి ఆత్మానందాన్ని పొందారు. వారి స్నేహితులు చెప్పడంతో ఇక్కడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు వివరించారు. ఆలయ అధికారులు ప్రత్యేక వసతులు కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ముక్కంటి సేవలో జర్మనీ దేశీయులు

 

ఫ్యామిలీలను పక్కన పెట్టేశారు… | Families were left aside… | Eeroju news

Related posts

Leave a Comment