Gautham Reddy | గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా | Eeroju news

గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా

గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా

విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్)

Gautham Reddy

విజయవాడ వైఎస్ఆర్‌సీపీ నేత పూనూరు గౌతం రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి అనే వ్యక్తిని సుపారీ హత్య చేయించేందుకు గౌతంరెడ్డి కుట్ర పన్నారని కేసు నమోదు అయింది. ఉమామమహేశ్వర శాస్త్రి ఇంటిని కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయనను చంపేయాలని గౌతంరెడ్డి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించిన ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరూ ఆయన దగ్గర పని చేసేవారు. పూనూరు గౌతంరెడ్డి విజయవాడలో కార్మిక సంఘం నేత అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన రౌడీయిజం, దందాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయనకు నేర చరిత్ర ఉంది.

దాదాపుగా 42 కేసులు ఆయనపై ఉన్నాయి. అందులో హత్య కేసులు కూడా ఉన్నాయి. రౌడీషీట్ కూడా ఉండేది. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో అనూహ్యంగా రౌడీషీట్ ఎత్తేశారు. దీనిపై పోలీసు శాఖలోనే విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు ఈ అంశం తెలిసిన తర్వాత ఏ కారణాలతో రౌడీషీట్ ఎత్తేశారో విచాణ చేయిస్తున్నామని తెలిపారు. గౌతంరెడ్డి గతంలోనూ ఉమామహేశ్వర శాస్త్రిపై దాడులు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దాంతో బిక్కు బిక్కుమంటూ గడుతున్నారు. తాజాగా ఆయన మరోసారి తన అనుచరులతో అదే పని చేయడంతో పోలీసుల్నిఆశ్రయించారు. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గౌతం రెడ్డి గతంలో వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయనపై ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనకు పదవులు లభించాయి. ఓ సారి వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన జగన్‌, అవినాష్ రెడ్డిలకు సమీప బంధువుగా ప్రచారం ఉంది. జగన్‌తో ఉన్న బంధుత్వం కారణంగానే ఆయన కు వైసీపీలో పదవులు దక్కుతాయని అంటున్నారు. తాజాగా ఈ సుపారీ హత్యకు సంబంధించి కేసు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి.. తన తల్లి పేరిట ఉన్న 325 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఆక్రమించారన్నది ప్రధాన ఆరోపణ. 2017 లోనే దీనిపై ఉమామహేశ్వర శాస్త్రి అధికారులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే అధికారులు గౌతమ్ రెడ్డికి నోటీసులు అందించారు. కానీ గౌతమ్ రెడ్డి మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం.. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిపోయింది. అయితే తన ఆస్తిని ఆక్రమించారని ఉమామహేశ్వర శాస్త్రి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిని సహించలేకపోయిన గౌతంరెడ్డి ఉమామహేశ్వర శాస్త్రిని హత్య చేయాలని ఓ గ్యాంగ్ తో సుపారి మాట్లాడుకున్నారు.ఈ క్రమంలోనే శాస్త్రి ఇంటి వద్ద అక్టోబర్ 31నరెక్కీ నిర్వహించారు. నవంబర్ 6న హత్యకు ప్రయత్నించారు.

అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులకు.. గౌతమ్ రెడ్డి సూత్రధారి అని తేలింది. ఈ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ‘ తన సైకోబాస్ బాబాయిని లేపేసిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని.. 25 లక్షల సుపారీ ఇచ్చి.. విజయవాడలో బ్రాహ్మణుడిని చంపాలని ప్లాన్ చేశారు జగన్ ప్రియ శిష్యుడు గౌతమ్ రెడ్డి. దానిని పసిగట్టి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్టు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా

Bandi Sanjay Kumar | కేటీఆర్ కు తొంగి చూసే బుద్దులే ఉన్నాయి | Eeroju news

Related posts

Leave a Comment