హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్‌గా మారబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ గా ఓఆర్ఆర్
హైదరాబాద్ డిసెంబర్ 30
హైదరాబాద్ నగరం చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. 5 ప్యాకేజీలుగా హైదరాబాద్ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు పిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్‌గా మారబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
1. విస్తృతమైన కనెక్టివిటీ:
రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ ఉంటుంది. నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో, పొరుగు రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఇది వస్తు, ఇతర సేవలను వేగవంతం చేస్తుంది. ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది.
2. కొత్త అభివృద్ధి కేంద్రాలు:
రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని పలు ప్రాంతాలు కొత్త అభివృద్ధి కేంద్రాలుగా మారతాయి. ఇక్కడ పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వస్తాయి. ఇది ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
3. ట్రాఫిక్ తగ్గుదల:
రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇంధన వ్యయం తగ్గుతుంది.
4. వ్యవసాయానికి ప్రోత్సాహం:
రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్‌కు చేరుకోవడం సులభం కావడంతో.. రైతుల ఆదాయం పెరుగుతుంది.
5. పర్యావరణం:
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పర్యావరణాన్ని కాపాడే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు.. చెట్లను నాటడం, వర్షపు నీటిని నిల్వ చేయడం వంటివి చేపట్టనున్నారు.
6. సామాజిక అభివృద్ధి:
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు పడతాయి. ఆరోగ్యం, విద్య వంటి సామాజిక సేవలు మరింత మెరుగుపడతాయి. ఫలితంగా ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది.
7. సులభమైన ప్రయాణం:
రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
8. పారిశ్రామిక అభివృద్ధి:
రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలో పారిశ్రామిక కారిడార్‌లు అభివృద్ధి చెందనున్నాయి. ఇది పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే పలు కంపెనీలను స్థాపించారు.
9. భూ విలువ పెరుగుదల:
రీజనల్ రింగ్ రోడ్డు మార్గంలోని భూమి విలువ భారీగా పెరుగుతుంది. ఇది స్థానిక ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
10. రాష్ట్రానికి గర్వకారణం:
రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలవనుంది. ఇది రాష్ట్రం అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు అదే స్థాయిలో అభివృద్ధి జరగనుంది.
టెండర్ వివరాలు..1వ ప్యాకేజీ:
గిర్మాపూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1529.19 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.
2వ ప్యాకేజీ:
రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు వరకు 26 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1114.80 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.
3వ ప్యాకేజీ:
ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు వరకు 23 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1184.81 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.
4వ ప్యాకేజీ:
ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి గ్రామం వరకు వరకు 43 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1728.22 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మించనున్నారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.
5వ ప్యాకేజీ:
రాయగిరి గ్రామం నుంచి తంగడ్‌పల్లి గ్రామం వరకు 35 కిలోమీటర్లు నాలుగు వరసల గ్రీన్ ఫీల్డ్ రహదారి. రూ.1547.04 కోట్లతో రెండు సంవత్సరాల్లో నిర్మిస్తారు. 5 సంవత్సరాల మొయింటెనెన్స్ ఉంటుంది.
5 ప్యాకేజీలుగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పొడవు 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7,104.06 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
Read:KTR:నిధులపై మాట మార్చిన కేటీఆర్, ఎందుకు?