Former Minister Harish Rao’s letter to Minister Uttam Kumar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ | Eeroju news

Former Minister Harish Rao's letter to Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ

సిద్దిపేట

Former Minister Harish Rao’s letter to Minister Uttam Kumar Reddy

సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్ లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు అయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసారు. . గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టి ఎం సీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టి ఎం సి లు, రంగనాయక సాగర్ లో 2.38 టి ఎం సి లకు గాను ప్రస్తుతం 0.67 టి ఎం సీలు, మల్లన్న సాగర్  18 టి ఎం సీలకు గాను  ప్రస్తుతం 8.5 టి ఎం సి లు, కొండ పోచమ్మ సాగర్  10 టి ఎం సి లకు గాను ప్రస్తుతం 4.5 టి ఎం సీలు మాత్రమే ఉన్నాయని అయన పేర్కోన్నారు.

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నానని లేఖ రాసారు.

Former Minister Harish Rao's letter to Minister Uttam Kumar Reddy

 

Harish must resign with loan waiver | రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా | Eeroju news

Related posts

Leave a Comment