బెంగళూరు వెళ్లనున్నమాజీ సీఎం జగన్
విజయవాడ
Former CM Jagan will go to Bangalore
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు. కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళుతున్నట్లు తెలుస్తోంది.. వారం పాటూ అక్కడే ఉంటారని చెబుతున్నారు. గత నెలలో కూడా జగన్ బెంగళఊరు వెళ్లిన సంగతి తెలిసిందే. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్.. ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువశాతం పులివెందుల, బెంగళూరులోనే ఉన్నారు.
ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరుకావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళుతున్నారనే ప్రచారంతో.. అసెంబ్లీకి వస్తారా?.. విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్భార్ ప్రారంభించాలని భావించారు. వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు.. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా పడింది.
Jagan criticizing Chandrababu is ridiculous | జగన్ చంద్రబాబును విమర్శించడం హస్యాస్పదం | Eeroju news