రాజకీయ నాయకులకు సినిమా వాళ్లంటే… చిన్న చూపు
హైదరాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
For politicians.. cinema is… short-sighted
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక వాళ్లు సాధించిన విజయాల వల్ల స్టార్ స్టేటస్ ని కూడా అందుకుంటున్నారు. దీనివల్ల వాళ్లకు ఎంతైతే క్రేజ్ వస్తుందో అంతే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రీసెంట్ గా హీరోయిన్ల మీద అయితే ప్రభుత్వ అధికారులు విచక్షణ రహితంగా కామెంట్స్ చేయడమే కాకుండా, వాళ్ల స్వప్రయోజనాల కోసం అపోజిషన్ పార్టీ పెద్దలను విమర్శించడానికి సినిమా రంగంలోని కొంతమంది హీరోయిన్లను అడ్డు పెట్టుకొని కామెంట్స్ చేయడం అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది… ఇక రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో మంత్రి గా కొనసాగుతున్న కొండా సురేఖ నటి సమంత పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కొండా సురేఖ మీద కేటీఆర్ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి ఆమె కేటీఆర్ మీద డైరెక్ట్ గా విమర్శలు చేయలేక సమంత ను అడ్డుగా పెట్టుకుంది. కేటీఆర్ నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండటానికి సమంతను తన దగ్గరికి పంపించమన్నాడని దానికి నాగార్జున, నాగచైతన్య కూడా సమంతని ఫోర్స్ చేయడంతో ఆమె కేటీఆర్ దగ్గరికి వెళ్లలేక నాగచైతన్యతో విడాకులు తీసుకుంది అంటు ఘాటు మాటలు మాట్లాడింది. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పెను దుమారం రేగింది. ఇక ఈ సంఘటన పైన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించడంతో ఎట్టకేలకు కొండా సురేఖ దిగివచ్చి సమంత కు అక్కినేని ఫ్యామిలీకి సారీ చెప్పింది. నిజానికి ఆమె సారీ చెప్పినంత మాత్రాన ఈ మ్యాటర్ అనేది క్లోజ్ అయినట్టు కాదు.
హీరోయిన్ల మీద ఇప్పుడనే కాదు చాలా రోజుల నుంచి ప్రభుత్వ అధికారులు ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళ కెరియర్లు నాశనం అయిపోతాయనే విషయాలను కూడా ఆలోచించకుండా మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని పరిజ్ఞానంతో వాళ్లను చాలా వరకు ఇబ్బంది పెట్టే కామెంట్స్ అయితే చేస్తున్నారు.మరి ప్రభుత్వ అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన నాయకులు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల పైన ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అంటూ పలువురు సినీ పెద్దలు సైతం రాజకీయ నాయకులపైన విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం చేతకాని ఈ రాజకీయ నాయకులు వాళ్లు తప్పించుకోవడానికి అపోజిషన్ పార్టీ వాళ్లు చేసే విమర్శలను తిప్పుకొట్టడానికి ఇలా సినిమాలోని సెలబ్రిటీలను వాడుకోవడం ముఖ్యంగా హీరోయిన్ల పేరు చెప్పి అవతలి వాళ్ళ నోరు మూయించడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ మీద గతంలో విమర్శలు చేస్తూ ఆయన పేరు కేటీ రామారావు కాదు రకుల్ రావు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక దాంతో ఒక్కసారిగా కేటీఆర్ కి రకుల్ ప్రీత్ సింగ్ కి మధ్య ఏదో కనెక్షన్ ఉంది అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలైతే వచ్చాయి. ఆ దెబ్బతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాలేదు. దాంతో ఆవిడ ముంబై వెళ్లి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయి పోయింది. ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమంతతో పాటుగా అక్కినేని కుటుంబాన్ని కూడా చాలా వరకు కించపరిచిందనే చెప్పాలి. నిజానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన నాగార్జునకు పెద్దగా వచ్చేదైతే ఏమీ లేదు.
అతనికి ఉన్న ఆస్తిలో ఎన్ కన్వెన్షన్ అనేది చాలా అంటే చాలా చిన్నది దానికోసం వాళ్లు అలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు.కనీసం పరిజ్ఞానం లేకుండా కామెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి అని ఇంగితా జ్ఞానం కూడా లేని ఈ నాయకులు జనాలకు సేవ చేస్తారు, ప్రజలను ఉద్దరిస్తారు అని నమ్మడం మన మూర్ఖత్వమే అవుతుంది. ఆడవాళ్ళ మీద ఆడవాళ్లే ఇలాంటి కామెంట్స్ చేసుకోవడం నిజంగా మన సంస్కృతి కి చాలా చెడ్డ పేరు అనే చెప్పాలి…నిజానికి ఆడవాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలియని ఈ సన్నాసులు మన అధికారులుగా ఉండడం నిజంగా మన దురదృష్టం అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలతో అధికార పార్టీ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది.
దాని వల్ల వాళ్ల మధ్య ఏదో జరిగిపోయింది అని క్లారిటీకి రావడం అనేది కరెక్ట్ కాదు. అపోజిషన్ పార్టీలో ఉన్న నాయకులకు సరైన సమాధానం చెప్పలేక ఇలా డొంక తిరుగుడు సమాధానాలతో ఇతరుల కెరియర్లని నాశనం చేయడం అనేది సరైన విషయం కాదు. రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ల పైన ఇలాంటి కామెంట్లు చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటి పరిస్థితి మరోసారి ఎదురైతే మాత్రం దారుణమైన కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటూ హెచ్చరిస్తున్నారు.