Food distribution to 2.14 lakh people per day | రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం | Eeroju news

Food distribution to 2.14 lakh people per day

రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం

తిరుమల, జూన్ 22, (న్యూస్ పల్స్)

Food distribution to 2.14 lakh people per day :

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో రివ్యూ చేశారు.  టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు  గౌతమి, శ్రీ వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.  వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. కాగా ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది.కాగా భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు.

ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.రుపతిలో అన్న ప్రసాదం నాణ్యత పై గతంలో చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఇది ఎప్పటికప్పుడు వెలుగు చూసాయి కూడా. ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత పై భక్తులే నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్న ప్రసాదం నాణ్యత పై ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టిటిడి డైలీ ఈవో, సోషల్ మీడియా వేదికగా కొందరు ఇదే విషయమై తరచూ ప్రస్తావించేవారు. కళ్లకు అద్దుకుని శ్రీవారే అందించినది గా భావించే అన్న ప్రసాదం అధ్వానంగా మారడంతో టీటీడీ చరిత్ర మసకబారింది. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముందుగా తిరుపతి నుంచి ప్రక్షాళన ప్రారంభించారు. సంవత్సరాలుగా టీటీడీ ఇంచార్జ్ ఈవోగా పాతుకుపోయిన ధర్మారెడ్డిని తప్పించారు. సిన్సియర్ అధికారిగా గుర్తింపు పొందిన శ్యామల రావును నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి అన్నప్రసాద నాణ్యత పై దృష్టి పెట్టారు. దీంతో భక్తులకు నాణ్యతతో కూడిన అన్న ప్రసాదం అందుతోంది.టిడిపి ప్రభుత్వాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాద నాణ్యతను పెద్దపీట వేసేవి. 1985లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత తిరుపతిలో అన్నప్రసాదశాలలు ఏర్పాటు చేశారు. అవి క్రమేపి విస్తరిస్తూ వచ్చాయి. భక్తుల కడుపు నింపేందుకు ప్రయత్నించేవి.మొత్తానికైతే టిడిపి అధికారంలోకి వచ్చింది.

తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్‌ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.

Food distribution to 2.14 lakh people per day

అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభం | Anna canteens relaunched | Eeroju news

 

 

Related posts

Leave a Comment