Finchanu program as a festival | పండుగలా ఫించను కార్యక్రమం | Eeroju news

Finchanu program as a festival

పండుగలా ఫించను కార్యక్రమం

విజయవాడ, జూన్ 24, (న్యూస్ పల్స్)

Finchanu program as a festival :

ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ ఫైల్ పై చంద్రబాబు సంతకం చేసిన సంగతి తెలిసింది. ఈనెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ లబ్ధిదారులకు అందం ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ నుంచి ఈ పెంపుదల వర్తింపజేయనున్నారు. నాలుగు వేల రూపాయల పింఛన్ మొత్తం తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెల కు సంబంధించి పెండింగ్ మూడు వేల రూపాయలు అందించనున్నారు. మొత్తంగా కలిపి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు అందనుంది. అయితే వాలంటీర్లతో పంపిణీ చేయాలా? ప్రభుత్వ సిబ్బందితో అందించాలా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.ఈ ఎన్నికల్లో పింఛన్ల అంశం ప్రధాన హామీగా మారింది.

రాము అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని 3,500 పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. అది కూడా రెండు విడతల్లో 250 చొప్పున పెంచుతామని చెప్పుకొచ్చారు.అయితే చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జూలైలో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో జూలై 1న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త పింఛన్ పుస్తకాలతో పాటు నగదు అందించాలని ఆదేశించారు.వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ₹4,000 పింఛన్ అందునుంది. అదేవిధంగా ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు 4000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దివ్యాంగులకు మూడు వేల నుంచి 6 వేలకు, పూర్తిస్థాయి దివ్యాంగులకు ఐదు నుంచి 15 వేలకు పింఛన్ మొత్తాన్ని పెంచనున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పింఛన్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల ఒకటి నుంచి ఈ పెంపుదల అమలు కానుంది. అయితే ఈ పింఛన్లను వాలంటీర్ల ద్వారా అందించాలా? లేకుంటే సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలా అన్నది ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల పెన్షన్లకు సంబంధించి ఎటువంటి నగదు సమస్య లేదని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. లై ఒకటో తేదీన ఇంటి వద్దనే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఇంటివద్దనే పింఛన్లు పంపిణీ చేపడుతున్నామని ఏపీ బీసీ, చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత చెప్పారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పెనుగొండ నియోజకవర్గానికి వచ్చిన టీడీపీ నాయకురాలు సవితకు పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారుబెంగళూరు విమానాశ్రయం నుంచి వయా సోమందేపల్లి, పెనుగొండ పట్టణము వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా మంత్రి సవిత ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలుపుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేనేత కార్మికుల బతుకుల్లో అభివృద్ధి వెలుగులు విరజిల్లుతాయన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ, రాయితీ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మంది పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఇచ్చిన బీసీ సంక్షేమం, చేనేత జౌళిశాఖ మంత్రి శాఖలలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు. త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశామన్నారు.

 

Finchanu program as a festival

 

ప్రతిరోజూ సచివాలయానికి చంద్రబాబు.. | Chandrababu to the secretariat every day.. | Eeroju news

 

 

Related posts

Leave a Comment