రుణ మాఫి కోసం రైతుల ధర్నా
కోదాడ
Farmers’ dharna for loan waiver
అధికారుల తప్పిదాలతో ప్రభుత్వ ఫలాలు అందక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల సుమారు వందమంది రైతులు రుణమాఫీ అందక లబోదిబోమంటున్నారు. పురుగు మందు డబ్బాలు పట్టుకొని బ్యాక్ ముందు నిరసన తెలిపారు. కెనరా బ్యాంకు పరిధిలో రేపాల నరసింహులగూడెం జగన్నాధపురం సీతానగరం విజయరామపురం గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు ఉన్నారు. వారిలో 300 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని అధికారులు తమ డేటాను ఉన్నతాధికారులకు పంపించకపోవడం వల్లనే తమకు రుణమాఫీ అందలేదని రైతులు వాపోతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించబడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.