Everyone over the age of 18 should have the right to vote | 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి | Eeroju news

Everyone over the age of 18 should have the right to vote

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

సి.బెళగల్

Everyone over the age of 18 should have the right to vote

సి.బెళగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష ఆదేశాల మేరకు తహసిల్దార్ విజయ శ్రీ ఆధ్వర్యంలో 2025 ప్రత్యేక సారాంశ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తహసిల్దార్ విజయ శ్రీ మాట్లాడుతూ 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి అయ్యే  ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఓటర్ కార్డులో ఏవైనా తప్పులుంటే సవరణ చేసుకోవాలని, ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓటు హక్కు కలిగి ఉండి గ్రామంలో నివసించని వ్యక్తుల పేర్లను ఓటరు జాబితలో నుండి తొలగించబడాలని తెలిపారు. ఈ పూర్తి ఓటర్ జాబితాను 2025 జనవరి నాటికి సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయ శ్రీ, ఎంఈఓ ఆదాం భాష, డిప్యూటీ తహసిల్దార్ కృష్ణమూర్తి మరియు మండల స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Everyone over the age of 18 should have the right to vote

 

Tirumala Tirupati Devasthanam Update for Srivari Devotees | 16 బ్రేక్ దర్శనాలు రద్దు… | Eeroju news

Related posts

Leave a Comment