సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
సంక్రాంతికి సిద్ధమౌతున్న బరులు
ఏలూరు, జనవరి 6
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గుర్తుకు వస్తాయి. ఏపీలో సంక్రాంతి అంటే కోడి పందేలు లేకుండా జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో అనేక విశిష్టతలున్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. పందె కోళ్లు కాలు దువ్వుతుంటే మీసం మీద మెలేసిన చేయి దించకుండా ఎన్నికల్లో గెలిచినట్లే ఫీలవుతారు చాలా మంది. కోడి పందేలు లేకుండా పండగ లేదు. పండగ అంటేనే కోడి పందేలు అనే రకంగా మారింది. కోడిపందేలకు ఉభయ గోదావరి జిల్లాల ప్రసిద్ధి. ప్రత్యేకంగా ఇందుకోసం బరులను తయారు చేస్తారు. ఎలా ఉంటాయంటే.. ఖరీదైన కార్లు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ కోడిపందేలకు హాజరవుతారు. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న వారితో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు సయితం కోడిపందేలు చూసేందుకు తరలి వస్తారు. కోడిపందేలు చూడకపోతే పండగ సక్రమంగా జరగనట్టేనని భావిస్తారు.
అందుకే సంక్రాంతి పండగ వేళ జరుగుతున్న కోడి పందేల కోసం వేల సంఖ్యలో జనం ఎదురు చూస్తుంటారు. కోడి పందేల కోసం ఏడాదంతా కోడి పుంజులను బరిలోకి దింపేందుకు సన్నద్ధం చేస్తుంటారు. వాటికి బలిష్టమైన ఆహారం ఇవ్వడంతో పాటు వివిధ రకాల ఎక్సర్‌సైజులు కూడా చేయిస్తారు. స్విమ్మింగ్ కూడా చేయిస్తారు. పందెం కోళ్లను సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటారు. వేల రూపాయలు జీతాలిచ్చి వీరిని అందుకోసమే వినియోగిస్తారు.. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. కేవలం డబ్బులే కాదు… గెలిచి వచ్చిన కోడిని ఊరేగింపుగా తీసుకెళ్లి తన ఇంట్లో మనిషిగా చూసుకుంటారు. అలాంటి కోడిపందేల కోసం ఇప్పుడే అంతా సిద్ధమయింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. అధికార పార్టీ నేతలు బరులను ఏర్పాటు చేయడంలో ముందుంటారు. పార్టీకి చెందిన అభిమానులు, కార్యకర్తలు ఆ బరుల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఈ పందేలను చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి మంత్రులు కూడా తరలి వస్తుంటారు. కోనసీమ కూడా కోడిపందేలకు ప్రసిద్ధి. ముందుగానే భీమవరం, నరసాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో హోటల్ రూమ్ లుకూడా ముందుగానే బుక్ చేసుకుని సంక్రాంతికి వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అనేక మంది. ఫ్లైట్ టిక్కెట్ లు కూడా ముందుగానే బుక్ అవుతున్నాయి.అక్కడ ఏ సౌకర్యాలున్నాయన్న దానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం మొదలయింది. ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా వినోదాలను బరుల దగ్గర సిద్ధం చేస్తున్నారు. దీంతో సంక్రాంతి పండగకు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి సులువుగా సమాచారం లభిస్తుంది. ఇప్పటికే భీమవరం, ఏలూరు వంటి నగరాల్లో ప్రధాన లాడ్జీలన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. పందెంరాయుళ్లు సంక్రాంతి మూడు రోజులు కోడిపందేలు చూస్తూ కాలక్షపం చేస్తుంటారు. పందేలు కాస్తుంటారు. కొందరు అక్కడ దొరికే పసందైన ఫుడ్ ను తింటారు. మద్యంకూడా అక్కడే అందుబాటులో ఉండటంతో ఇక ముక్కతో పాటు మందు కూడా సేవించి ఫుల్లు ఎంజాయ్ చేస్తారు. పోలీసులు ఎప్పటిలాగానే ఈసారి కూడా కోడిపందేలపై ఆంక్షలున్నాయని చెబుతున్నా బరులు మాత్రం సిద్ధమవుతున్నాయి. ఇక వాటిని చూసి రావడమే మిగిలింది.