జీమెయిల్, వాట్సప్ లకు మస్క్ చెక్…
న్యూయార్క్, డిసెంబర్ 19 (న్యూస్ పల్స్)
ఎలాన్ మస్క్ హ్యాండ్ పడితే అది తిరుగులేని విజయం సాధిచడం ఖాయం. టెస్లా దగ్గర నుంచి స్సేస్ ఎక్స్ వరకూ ఆయన చేపట్టిన ప్రాజెక్టులు బంపర్ హిట్లు అయ్యాయి. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. ట్విట్టర్ కొన్నప్పుడు ఆయన ఆస్తిలో సగం అయిపోయిందని అనుకున్నారు. కానీ రెట్టింపు అయింది. మొన్నటి దాకా ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎలాన్ మస్క్ కు ట్రంప్ కొత్త పదవి ఇచ్చారు. అది పూర్తి స్థాయి పదవి కాదు. తన వ్యాపారాలు తాను చేసుకుంటూ డోగే అనే వ్యవస్థను నడపాల్సి ఉంటుంది. ఆయనకు రకరకాల సలహాలను సోషల్ మీడియాలో ఇస్తూంటారు నెటిజన్లు. తాజాగా ఆయనకు .. ఎలాన్ మస్క్ ఈమెయిల్ సర్వీస్ ను ప్రారంభిస్తే తాము జీమెయిల్ ను డంప్ చేస్తామని ఓ నెటిజన్ ఆఫర్ ఇచ్చారు. అది చూసిన మస్క్.. భిన్నంగా స్పందించారు. మెసెజింగ్ మీదనే మొత్తం ధింక్ చేయాల్సి ఉందని అందులో ఈమెయిల్‌తో పాటు అన్ని మెసెజింగ్ వ్యవస్థలపైనా చర్చించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తర్వాత మరో నెటిజన్ ఎక్స్ మెయిల్ క్రియేట్ చేసి చూపించారు. అవును.. తర్వాత చేయాల్సిన పని ఇదేనని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత చాలా మంది చాలా వాటిపై సలహాలు ఇచ్చారు. ఒకరు యూట్యూబ్ సంగతి కూడా చూడాలన్నారు. ఎలాన్ మస్క్ రిప్లయ్స్ చూస్తే ఆయన త్వరలో జీ మెయిల్ కు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read : Trump and Elon Musk… | ట్రంప్ వెనుక ఎలన్ మస్క్… | Eeroju news