Elephants Hulchul in Chittoor Dist | చిత్తూరులో గజరాజుల బీభత్సం.. | Eeroju news

చిత్తూరులో గజరాజుల బీభత్సం..

చిత్తూరులో గజరాజుల బీభత్సం..

తిరుపతి, అక్టోబరు 16, (న్యూస్ పల్స్)

Elephants Hulchul in Chittoor Dist

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య రోజు రోజుకు తీవ్రతరం అయ్యింది. రైతులకే కాదు ఏనుగుల మనుగడకు ప్రశ్నార్ధకంగా మారింది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాదు రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.అడవిని వదిలి గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగు గుంపు పీలేరులో మరో రైతును పొట్టన పెట్టుకుంది. గజరాజులు చిత్తూరు జిల్లా రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి.

ఏనుగుల సమస్య రైతాంగానికి అతి పెద్ద సమస్యగా మారింది. పంట పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపెడుతున్నారు. శేషాచలం అడవులు, కౌండిన్య అభయారణ్యంతో పాటు చిత్తూరు జిల్లాకు ఇరువైపులా ఉన్న తమిళనాడు కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు పంట నష్టం, ప్రాణ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. వ్యవసాయ పనిముట్లు, బిందు సేద్యం పరికరాలతో పాటు బోరు బావులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న ఏనుగులు ప్రమాదాలకు కూడా గురి అవుతున్నాయి.

మరోవైపు దాడులకు దిగుతున్నాయి. దీంతో ప్రాణ నష్టం కలుగుతోంది. పీలేరు సమీపంలో ఏనుగుల గుంపు సంచారం రైతు ప్రాణాలను బలి తీసుకుంది. పీలేరు మండలం చిన్నగాండ్లపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలో తిష్ఠ వేసిన 15 ఏనుగులు గుంపు మామిడి తోటకు కాపలాగా ఉన్న రైతు చిన్న రాజారెడ్డి పై దాడి చేసింది. ఏనుగుల దాడిలో చిన్న రాజారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా,మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఏనుగుల దాడికి గురై మృతి చెందిన చిన్న రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసానిచ్చారు. ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే తెలిపారు. పీలేరుకు సమీపంలోనే ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

చిత్తూరులో గజరాజుల బీభత్సం..

Elephants | ఏనుగుల సమస్యకు ఫుల్ స్టాప్… | Eeroju news

Related posts

Leave a Comment