కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్తు చార్జీలు భారాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని కాకినాడ లో వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు..
విద్యుత్ చార్జీలపై వైకాపా నిరసనలు
కాకినాడ
కూటమి ప్రభుత్వం ప్రజలపై పెంచిన విద్యుత్తు చార్జీలు భారాన్ని వెంటనే ఉపసహరించుకోవాలని కాకినాడ లో వైఎస్ఆర్సిపి నాయకులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.. మాజీ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిటీ వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఎస్సీ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ర్యాలీగా చేరుకొని కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఎస్సీకి వినతిపత్రం అందజేశారు..ఈనిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాకినాడ సిటీ,రూరల్ నియోజవర్గాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పాల్గొన్నారు..
Read:Hyderabad:42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుంటే ఎన్నికలు జరగనివ్వం