ప్రశాంతంగా జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు
సి.బెళగల్
Elections of the Education Committee were peaceful
సి.బెళగల్ మండలంలోని పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పాఠశాల ఎన్నికలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ మెంబర్లను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని కొన్ని గ్రామాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ పాఠశాల విద్యా ఎన్నికల్లో పోలకల్ హై స్కూల్ చైర్మన్గా టి.చిన్న రామయ్య, వైస్ చైర్మన్ గా బజారమ్మ, సి.బెలగల్ హై స్కూల్ చైర్మన్ గా ముందరింటి గోవిందు, వైస్ చైర్మన్ గా మహేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా తిమ్మప్ప, వైస్ చైర్మన్ సజీవమ్మా ,వైస్ చైర్మన్ గా సజీవమ్మ,కంబదహాల్ చైర్మన్ గా చిన్న రాముడు వైస్ చైర్మన్ గా సలోమి, ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్మన్ లను వైస్ చైర్మన్ లను కమిటీ మెంబర్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. సమస్యాత్మక గ్రామాలలో విద్యా కమిటీ ఎన్నికలు జరిగే చోట ఎస్సై తిమ్మారెడ్డి తన సిబ్బందితో కలసి ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు జరిపారు.