. నీటి పారుదల శాఖ మంత్రి కి హరీష్ రావు ఫోన్
హైదరాబాద్
ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలి
మిడ్ మానేరు నుండి 1 టి ఎం సీల నీటిని రంగనాయక సాగర్ లోకి ఎత్తి పోయండి.
యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించాలి.
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఫోన్ లో కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట నియోజకవర్గం లో పంట పొలాలకు సాగునీళ్లు అందుక పంట పొలాలు ఎండి పోతున్నాయని మిడ్ మానేరు నుండి రంగనాయక సాగర్ లోకి నీటిని ఎత్తి పోయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు.
నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈయేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రైతుల పక్షాన ఫోన్ ద్వారా కోరారు. రైతులకు మంచి పంట రాబడి పెరిగింది. రంగనాయక సాగర్ కింద ఇలా ప్రతి యేటా గణనీయంగా పంట రాబడి పెరుగుతుందన్నారు. ఈ ఏటా 50వేల ఎకరాల పంట ఉన్నదని ఫోన్ లో పేర్కొన్నారు. రంగనాయక సాగర్ లో ఇటీవల మీరు 2.4 టి ఎం సిల నీళ్లు పంపింగ్ చేశారని ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 1.5 టీ ఎం సి ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలి అంటే ఇంకా కనీసం 1 టిఎంసి ల నీళ్లు అవసరం ఉన్నాయన్నారు. కావున మిడ్ మానేరు నుండి రంగనాయక సాగర్ లోకి వెంటనే నీళ్లు పంపింగ్ చేయాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించగలరని విజ్ఞప్తి చేశారు. రైతులు సాగు నీళ్లు లేక పంటలు ఎండి పోయే పరిస్థితి ఉంది అన్నదాతలు తీవ్ర ఆందోళన లో ఉన్నారని గుర్తు చేసారు. పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి కి రైతులకు సాగు నీరు అందించినట్టు గా ఈ యాసంగి పంటకాలం పూర్తి అయ్యేఅంత వరకు రైతుల పంట పొలాలకు సాగు నీరు అందిచాలని సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన తమరికి విజ్ఞప్తి చేయుచున్నట్లు ఫోన్ ద్వారా కోరారు.