దసరా సెలవులు విద్యార్థులకు గుడ్‌న్యూస్
Dussehra holidays
విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే. ఎగిరి గంతేస్తుంటారు. ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి. ఇప్పుడు దసరా పండగ రాబోతోంది. దసరా పండగ సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలవుల్లో కుటుంబం ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రాంరభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి.
ఆ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. సెలవులు రాగానే ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.