గురుకుల పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్ సునీత
సి.బెళగల్
Dr. Sunitha conducted medical examinations for the students of Gurukula School
సి బెలగల్ మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సి.బెళగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సునీత సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే డయేరియా, టైఫాయిడ్ ,మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల గురించి పిల్లలకు తెలియజేశారు. పిల్లలకు ఆరోగ్య విద్య అనే పాఠ్యాంశం బోధించి, అనారోగ్యాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి తెలిపారు. అనంతరం జ్వరాలు వచ్చిన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు భోజనం చేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలనీ,అలాగే రాత్రి సమయంలో దోమలు రాకుండా వేపాకు పొగ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని సునీత, ప్రిన్సిపాల్ బలరాముడు, హెల్త్ సూపర్వైజర్ కె.మద్దిలేటి, ఎంఎల్హెచ్పి ప్రభావతి,మంజుల, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Paritala with an innovative platform | వినూత్న వేదికతో పరిటాల | Eeroju news