Don’t ruin your life by smoking marijuana District SP Akhil Mahajan | గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దు | Eeroju news

SP Akhil Mahajan

గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దు
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల

Don’t ruin your life by smoking marijuana District SP Akhil Mahajan

గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సంక్షేమంలో కౌన్సెలింగ్.
యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు అని ఒక మంచి ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో గతంలో పలు సందర్భంల్లో గంజాయి సేవిస్తూ పట్టుబడి వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా చాలావరకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు అనుకోకుండా నేరాలు  చేసే అవకాశం ఉంటుందని, మతుపదార్థాలకు అలవాటు పడి ఏదైనా నేరం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం రాదని, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లలేరని అన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్ధాల బారిన పడిన యువకులు సత్ప్రవర్తనతో మంచి మార్గంలో నడుచుకోవడానికి ఈ కౌన్సిలింగ్ మంచి మార్గమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రవర్తనలో మార్పు తెచ్చుకొవలన్నారు.చెడు వ్యసనాలను దూరం చేసుకుని మంచి ప్రవర్తనతో మెలగాలని లేని పక్షంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుదన్నారు.

గంజాయికి అలవాటు పడి మానుకో లేని పరిస్థితి ఉన్న వారికి జిల్లాలో ఏర్పాటు  చేయబడిన డి అడిక్షన్ సెంటర్ లో సైకలజిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ తో పాటుగా వైద్య సదుపాయాలు అందజేయం జరుగుతున్నారు. మీ చుట్టుపక్కల లేదా మీ యొక్క గ్రామాల్లో ఎవరైనా గంజాయి కి అలవాటు పడిన పరిస్థితి ఉంటే వారి యొక్క వివరాలను తెలపాల్సిందిగా సూచించారు. గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు మత్తు పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గంజాయిజి సంబంధించిన సమాచారం పోలీస్ వారికి అందించాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో  డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సిఐ లు రఘుపతి, సదన్ కుమార్, ఎస్.ఐ మల్లేశం సిబ్బంది ఉన్నారు.

 

SP Akhil Mahajan

 

AP DSC 2024 Notification | 30న డీఎస్సీ నోటిఫికేషన్ | Eeroju news

 

Related posts

Leave a Comment