వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద
రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం
వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు
పత్తికొండ
Dog Attacks
పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో అటు పాదా చారులు, ఇటు ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లల్ని ఒంటరిగా పంపాలంటే భయంగా ఉంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఆర్టీసీ, పాత బస్టాండు లు, కటికే వీధి , చక్రాల రోడ్డు , అంబేద్కర్ సర్కిల్ , ప్రాంతాల్లో కుక్కల విహారం ఎక్కువగా ఉంటున్నాయని పట్టణవాసులు తెలిపారు.