DJ Drugs in Hyderabad | హైదరాబాద్ లో డీజే డ్రగ్స్…. | Eeroju news

DJ Drugs

హైదరాబాద్ లో డీజే డ్రగ్స్….

హైదరాబాద్, జూలై 1, (న్యూస్ పల్స్)

DJ Drugs in Hyderabad

మొదట ఫుల్ జాయ్‌.. ఎక్కడ లేని ఉత్సాహాం, అంతకుమించిన ఉత్తేజం.. మబ్బుల్లో విహరించే ఫీలింగ్.. ఇది ఫస్ట్ స్టేజ్.. ఆ తర్వాత మనకు తెలియకుండానే మనం బానిసలమైపోతాం.. ఇది సెకండ్ స్టేజ్.. ఇక ఆ తర్వాత కుంగి, కృశించిపోవడం.. అటు నుంచి అటే టపా కట్టేయడం.. ఇది ఫైనల్ స్టేజ్.. దీనంతటికి కారణం.. డ్రగ్స్.. ఇప్పుడా డ్రగ్స్‌ మహమ్మారి తెలంగాణలో డేంజర్ బెల్స్‌ మోగిస్తుంది. పబ్స్‌ వేదికగా యువతను మెల్లిగా మింగేస్తోంది.డీజే.. పబ్స్‌లో చెవులకు మత్తెక్కిస్తూ.. మనల్ని మనం మరిచిపోయేలా చేసి బాడీతో డాన్స్‌ చేపించడం వారి పని.. మూడ్‌కు తగ్గ బీట్‌ను ప్లే చేస్తూ కాళ్లని కదిలేలా చేసి.. మ్యూజిక్‌తోనే నిషా ఎక్కించడం వారి పని.. కానీ మ్యూజిక్‌తో మ్యాటర్ వర్కౌట్ అవడం లేదనుకున్నారేమో.. సైడ్ బిజినెస్‌గా డ్రగ్స్‌ అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికే అలవాటైన వారికి అమ్ముతూ.. కొత్తవారికి అలవాటు చేస్తూ అతి పెద్ద క్రైమ్ చేస్తున్నారు.

రీసెంట్‌గా డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడుతున్న వాళ్లలో డీజేలు ఎక్కువగా ఉన్నారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ అమ్ముతూ మరో ఇద్దరు డీజేలు పట్టుబడ్డారు. వీరి నుంచి MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఈ ఇద్దరు ప్రబుద్ధులు.వీరిద్దరే కాదు.. ఈ మధ్య డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా డీజేలు ఉంటున్నారు. వీరితో ఎక్కువ మందికి పరిచయాలు ఉండటం.. పబ్‌లతో మంచి రిలేషన్‌ మెయింటేన్ చేస్తుండటంతో డ్రగ్స్‌ స్మగ్లర్లంతా వీరినే రంగంలోకి దించుతున్నట్టు అనుమానాలున్నాయి. అంతేకాదు.. ఈ మధ్య డ్రగ్స్‌తో పట్టుబడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. థాంక్స్‌ టు నార్కోటిక్ డిపార్ట్‌మెంట్.. బట్ ఇంత మంది డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడ్డారనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఈ మహమ్మారికి బానిసైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి మెరుగైన చికిత్స అందించి మాములు మనుషులను చేయాల్సి ఉంటుంది. లేదంటే చాలా తీవ్రమైన పరిణామాలుంటాయి.

టెన్షన్ పడటం.. చికాకు.. హైపర్ యాక్టివ్‌నెస్, డ్రగ్స్ సంపాదించేందుకు ఎంతకైనా తెగించడం.. వీక్‌గా అయిపోవడం.. నిద్రలేమి.. అనవసరపు ఆవేశం ఇలాంటివన్ని బయటికి కనిపించగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం.. హర్ట్ కు సంబంధించిన ఇష్యూస్ రావడం, లివర్‌ దెబ్బతినడం మొత్తం నాడీ వ్యవస్థ దెబ్బతినడం లాంటివి బయటికి కనిపించని సమస్యలు.. ఇవన్నీ డ్రగ్స్ పుణ్యమే.. అయినా కూడా చదువుకున్న యువత కూడా వీటికి బానిసవుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. ఇండియాలో 14.6 కోట్ల మంది ఆల్కహాల్‌కు బానిసలుగా ఉన్నారు. ఇది .. అలవాటు కాదు.. బానిసలుగా ఉన్నారు. ఇక 3 కోట్ల మంది డ్రగ్స్‌ వాడుతున్నారు.

వీరిలో ఎనిమిది లక్షల మంది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. వీరి ఫ్యూచర్‌ ఇప్పుడు అంధకారంలోకి వెళ్లినట్టే. అసలు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? అనే దానిపై ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు హడావుడి చేసి వదిలేయడం కాకుండా.. ఈ మధ్య నార్కోటిక్స్‌ బ్యూరో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ ఈ తనిఖీలను మరింత పెంచాలి.. చెక్‌పోస్ట్‌లలో మరింత అలర్ట్‌గా ఉండాలి. అప్పుడే రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎంటర్ కాకుండా ఉంటుంది. కానీ స్మగ్లర్లు మరింత తెలివి మీరి ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. పక్కాగా ఓ సప్లై చైన్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తోంది. వీటికి బ్రేక్ వేయాలి.. అప్పుడే డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌గా తెలంగాణ.. డ్రగ్‌ ఫ్రీ నేషన్‌గా ఇండియా ఏర్పడుతోంది.

DJ Drugs

 

హైదరాబాద్ రియల్ పై ప్రభావం | Impact on Hyderabad Real | Eeroju news

Related posts

Leave a Comment