మాయమవుతున్న చెరువులు…
హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్)
Disappearing ponds
నిత్యం హైదరాబాద్ వార్తలలో చెరువు కబ్జాలు సాధారణమైపోయాయి. ఒక్క హైదరాబాద్ నగరమే అనుకుంటే పొరపాటు తెలంగాణవ్యాప్తంగా పలు నగరాలలో ఇదే పరిస్థితి. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ఇక్కడ మొదటినుంచి వర్షాల మీదే ఆధారపడి జీవించేవారు. అుందుకే వర్షపు నీటిని ఒడిసిపట్టి ఇతరత్రా అవసరాలకు యోగ్యమయ్యేలా చెరువులను ముందు చూపుతో అప్పటి రాజులు, నవాబులు తవ్వించారని చరిత్ర చెబుతోంది. మరి అలాంటి చెరువులన్నీ ఏమైయ్యాయి. ఏటా సమృద్ధిగా వర్షాలు పడుతున్నా చెరువులు తగ్గిపోవడంతో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం ఆరంభం అయింది. దీనికంతటికీ కారణం చెరువుల కబ్జాలే కారణం.టీ.సర్కార్ వెబ్ సైట్ ప్రకారం కేవలం 19 వేల 314 చెరువులకు సంబంధించిన సమాచారమే ఉంది.
రాష్ట్రంలో కాకతీయుల కాలం నుంచి నిజాం రాజుల వరకు ఉన్న సుమారు లక్షన్నర చెరువులు తమ ఉనికిని కోల్పొయి, కాంక్రీట్ భవంతుల కింద మసకబారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చెరువులు కుంటలు కలిపి 46వేల 531 మాత్రమే ఉన్నాయి. 2015లో 46 వేల చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించింది. మిషన్ కాకతీయ పథకం అమలు తీరు పక్కన పెడితే ప్రభుత్వం దగ్గర ఈ చెరువుల సమాచారం ఉండే అవకాశం ఉంది. ప్రతి చెరువుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి అంచనా వేయడానికి ఈ పట్టిక ఉంటే ఉపయోగపడుతుంది. 2021లో మీడియాలో వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీర్- ఇన్- చీఫ్, చీఫ్ ఇంజినీర్ల ప్రాదేశిక పరిధులలో ఉన్న 43,870 చెరువులలో 21,552 చెరువులు అలుగులు పారినాయి, 13,451 చెరువులు 75 శాతం నుంచి 100 శాతం వరకు నింపడమైంది.
ఈ చెరువుల సమాచారం కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు మనం భావించాలి. చెరువుల సంఖ్య ఎంత అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కచ్చితమైన లెక్కలు లేవు అనేది స్పష్టం.అన్యాక్రాంతమవుతున్న చెరువుల పరిరక్షణకు ఎట్టకేలకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణకు ఇప్పటికే ఈవీడీఎం జవాన్లతో పహారా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ చెరువుల పరిరక్షణతో పాటు ఇతర సేవలను కూడా పారదర్శకతతో అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తొలుత 6 చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన మొత్తం 93 సీసీ కెమెరాల పహారా సరైన ఫలితాలిస్తుండటంతో మిగిలిన మొత్తం చెరువుల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.
పైగా వచ్చేవి చెరువులతో ముడిపడిన ఫండుగలు. వాటిలో ప్రధానమైనవి బోనాలు, వినాయకచవితి, బతుకమ్మ పండుగలు. వీటిని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ ఎంసీ చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.ఒక్కో చెరువు చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫీటీఎల్) కవరయ్యేలా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల సైజును బట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద చెరువుగా చెప్పుకునే దుర్గం చెరువు చుట్టూ ఏకంగా 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చెరువు ఎంట్రెన్స్‌తో పాటు రాకపోకలు సాగించే వారితో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవీడీఎం జవాన్ల పనితీరును కూడా ఈ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
Monsoons spread all over the country | దేశమంతా విస్తరించిన రుతుపవనాలు | Eeroju news