Dipadas Munshi:దీపాదాస్ మున్షీ తప్పిస్తారని ప్రచారం

Dipadas Munshi will escape

కింది మీద పడి పదేళ్ల తర్వాత పార్టీ పవర్‌లోకి వచ్చింది. వన్‌ ఈయర్‌ పాలన కూడా కంప్లీట్‌ అయింది. అయినా పార్టీ పరంగా ఏదో లోటు ఉందని భావిస్తోందట హస్తం పార్టీ హైకమాండ్. పార్టీలో ప్రక్షాళన చేయాలని ఫిక్స్ అయ్యారట.

దీపాదాస్ మున్షీ తప్పిస్తారని ప్రచారం

హైదరాబాద్ జనవరి 18
కింది మీద పడి పదేళ్ల తర్వాత పార్టీ పవర్‌లోకి వచ్చింది. వన్‌ ఈయర్‌ పాలన కూడా కంప్లీట్‌ అయింది. అయినా పార్టీ పరంగా ఏదో లోటు ఉందని భావిస్తోందట హస్తం పార్టీ హైకమాండ్. పార్టీలో ప్రక్షాళన చేయాలని ఫిక్స్ అయ్యారట. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ నుంచే మార్పులు, చేర్పులు మొదలు పెడుతారని చర్చ జరుగుతోంది. త్వరలోనే టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గ ఏర్పాటు చేస్తారట. అంత కంటే ముందే ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపా దాస్ మున్షిని తప్పిస్తారన్న టాక్ వినిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి కూడా 4 నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. గతంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నియమించిన పాత కార్యవర్గమే కొనసాగుతూ వస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించినప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదట. దీంతో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులంతా ఇంకెప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారట.ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందట హైకమాండ్. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టిన అధిష్టానం పెద్దలు..ముందుగా చాలా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారట.

అయితే పీసీసీ ప్రక్షాళన కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపా దాస్ మున్షీని మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్.దీపా దాస్ మున్షీని తప్పించాలని ఢీల్లీ పెద్దలు నిర్ణయించడానికి చాలా కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలామంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్‌మున్షీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారట. అధికార పార్టీకి ఇంచార్జ్‌గా ఉన్న దీపా దాస్ మున్షి వ్యవహరించే తీరు ఇది కాదన్నది మెజార్టీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో ఆమె ఫెయిల్‌ అయ్యారని భావిస్తున్నారట నేతలు. ఎన్నికల సమయంలో కొంతమందికి పట్టుబట్టి టికెట్లు ఇప్పించారని, ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు నచ్చిన కొన్ని పేర్లను తెర మీదకి తెస్తున్నారంటూ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి వారు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా..దీపా దాస్ మున్షి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సహా, మంత్రులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో దీపాదాస్‌కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని అంటున్నారు. అందుకే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లోపించిందని నేతలు వాపోతున్నారు. ఈ విషయాలన్నీ నేతలు వరుసగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఢిల్లీ పెద్దలు కూడా దీపాదాస్ తీరుపై నివేదిక తెప్పించుకున్నారని తెలుస్తోంది.అందులో భాగంగానే మొన్న గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా హాజరయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీని తప్పించి..తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలుపెడుతామని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని..ఆశల పల్లకిలో ఉన్నారు ఆశావహులు. అయితే దీపాదాస్‌ మున్షిని తప్పిస్తారా ఒకవేళ తప్పిస్తే ఇంచార్జ్‌గా రాబోయే నేత ఎవరనేది ఆసక్తిరేపుతోంది.

Read:Warangal:ఆర్టీసీకి కాసుల వర్షం

Related posts

Leave a Comment