తెగని ధర్మవరం పంచాయితీ…..
అనంతపురం, అక్టోబరు 1, (న్యూస్ పల్స్)
Dharmavaram Panchayat
ధర్మవరం.. ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు కేరాఫ్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇష్యూతో ధర్మవరంలో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లిఖార్జునను తీసుకురావడం..లోకల్ టీడీపీ క్యాడర్‌కు..లీడర్లకు నచ్చడం లేదు. ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి సత్యకుమారే మల్లిఖార్జునను తిరిగి మున్సిపల్ కమిషనర్‌గా తెచ్చారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.ప్రస్తుత ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున..గత వైసీపీ హయాంలో కూడా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు.
అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు మల్లిఖార్జున అండగా నిలిచారని..మున్సిపల్ కమిషనర్ సహకారంతో కేతిరెడ్డి రెచ్చిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మల్లిఖార్జున తమను ఎంతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహంతో ఉంది టీడీపీ క్యాడర్.వైసీపీ కండువా కప్పుకుంటేనే పనులు చేసి పెడతానని హింసించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారని, నామినేషన్లు కూడా వేయనీకుండా అడ్డుకున్నారని..అలాంటి వ్యక్తికి మంత్రి వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కష్టపడి గెలిపిస్తే తమ మాటను లెక్క చేయకుండా..
అపోజిషన్‌లో ఉన్నప్పుడు తమను ఇబ్బందిపెట్టిన అధికారిని తిరిగి తీసుకొస్తారా అంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు.ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లికార్జున నియామకం కూటమిలో అసంతృప్తికి కారణమైంది. ఈ నియామకాన్ని ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే లేటెస్ట్‌గా ధర్మవరం మున్సిపల్ ఆఫీస్‌లో మంత్రి సత్యకుమార్ రివ్యూ మీటింగ్ పెట్టారు. దీనికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కూడా హాజరయ్యారు.అప్పటికే ఆగ్రహం మీదున్న టీడీపీ శ్రేణులు కమిషనర్‌ను లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న సత్యకుమార్ ఎన్డీయే కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున మంత్రి క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కమిషనర్ మల్లికార్జునను వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు.టీడీపీ నేతల రచ్చ ఇలా ఉంటే మంత్రి సత్యకుమార్..మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వెనకేసుకొచ్చారు. ఆయన సమర్థుడైన అధికారని.. ధర్మవరం అభివృద్ధికి అతడిలాంటి అధికారి అవసరమన్నారు. గత ప్రభుత్వంలో పనిచేశారన్న కారణంతో కొన్ని పార్టీల నేతలు మున్సిపల్ ఛైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారని..ఇది మంచి పద్ధతి కాదంటున్నారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదన్నారు సత్యకుమార్.
మరోవైపు ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ నియామకాన్ని వ్యతిరేకించిన పరిటాల శ్రీరామ్.. మంత్రికి అన్ని విషయాలు వివరించామంటున్నారు. మున్సిపల్ కమిషనర్ తీరుతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డామని.. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునకు సంబంధం ఉందంటున్నారు.ఈ విషయాలన్నీ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లామని.. అన్ని అంశాలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు కలిసే ఉన్నాయని..చిన్న చిన్న ఇబ్బందులున్నా.. అంతా సెట్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ ఇష్యూ బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మల్లిఖార్జున నియామకాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. ఇది ఎటుదారి తీస్తుందోమోనన్న చర్చ జరుగుతోంది.