ప్రమాద బాధితులను పరామర్శించిన దేవినేని
విజయవాడ
Devineni visited the accident victims
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా మంగళవారం పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్ టి టి పి ఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన దురాగతలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం. నట్టు బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు . వైసిపి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు బూడిద దోచుకొని ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నంగా మార్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్ల పని చేసేది సీఈ స్థాయి అధికారులను శాసిస్తున్నాడు.
క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు . బూడిద చెరువులో బూడిద అమ్ముకొని కోట్లు దండుకున్నారు. నార్ల తాతారావు, , మల్లెల పద్మనాభరావు, గారు అందరూ దీన్ని జాగ్రత్తగా చూసుకున్నారు గత తెదేపా హయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి పాపాలు జరగకుండా కాపాడారని అన్నారు. గత ఐదేళ్లు బూడిద ఎవరు దోచుకుతున్నారో వీటన్నిటిపై విచారణ జరిగేలా మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి వాసంశెట్టి సుభాష్ చర్యలు తీసుకుంటామన్నారు .
Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news