ఉప్పాడ తీరప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పిఠాపురం
Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region
పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. పిఠాపురం, నవకండ్రవాడ, వాకతిప్ప, యు.కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దారి పొడుగునా ప్రజలు అయనకు స్వాగతం పలుకగా అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.
Welcome to Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news