అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత
రాజేంద్రనగర్
Demolition of illegal farm house
ఎమ్మార్పీఎస్ s నేత నరేందర్, ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ దర్మగిరి గుట్ట లో బంధించిన ఫామ్ హౌస్ ను శంషాబాద్ మునిసిపల్ అధికారులు కూల్చివేసారు. ఫామ్ హౌజ్ కు అనుమతులు లేవని గుర్తించిన మునిసిపల్ అధికారులు ఫామ్ హౌస్ యాజమానికి నోటీసు జారీ చేసారు. ఫామ్ హౌజ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసుల ఫిర్యాదు తో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీ సహాయం తో ఫామ్ హౌజ్ ను నేల మట్టం చేసారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి.