ఢిల్లీలో డేంజర్ బెల్స్…
న్యూఢిల్లీ, అక్టోబరు 25, (న్యూస్ పల్స్)
Delhi Air Pollution Alert
ఢిల్లీలో కాలుష్య స్థాయి మరింత ప్రాణాంతకంగా మారింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య తీవ్రతతో కళ్ల మంటలు, గొంతు నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది.ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2 ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. కాలుష్యాన్ని నియంత్రించడానికి గ్రీన్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ ఆన్, వెహికల్ ఆఫ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతోంది. ఇందుకోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించింది ప్రభుత్వం.ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 349 పాయింట్లుగా కాలుష్యం తీవ్రత నమోదు కావడం జరిగింది. ఈ తరహా పరిస్థితులు మరికొద్ది రోజులు పాటు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో అక్కడి నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి కాలుష్యం అంతా ఢిల్లీని కమ్మేస్తోంది. ఢిల్లీలో విండ్ స్పీడ్ లేకపోవడం, పొగ మంచు కురుస్తుండటం, శీతాకాలం ప్రారంభం అవుతుండటంతో ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం అంతా కూడా గాలిలోనే నిలిచిపోయి కాలుష్యం తీవ్రత అనేది అధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది.ప్రపంచంలోనే కాలుష్య ప్రభావిత నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజానికం తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కళ్ల మంటలు, దగ్గు, గొంతు నిప్పి, శ్వాస కోశ సంబంధ సమస్యలు.. కాలుష్య తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి.ఉదయం మార్నింగ్ వాక్స్ వెళ్లలేని పరిస్థితి. విజిబులిటీ గణనీయంగా పడిపోతున్న పరిస్థితి ఉంది.
దుమ్ము, ధూళి కణాలు గాలలోనే నిలిచి ఉండటంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఢిల్లీలో నెలకొన్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో కాలుష్య తీవ్రత ప్రతీ ఏడాది శీతాకాలం సమయానికి ఢిల్లీ వాసులు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.